Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బాంబుల మోత ఆగడం లేదు. యుద్ధ భయంతో జనం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. సుమీ(Sumi) నుంచి అతికష్టం మీద 693 మంది భారతీయ విద్యార్ధుల(Indian Students)ను తరలించారు. ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. సాధారణ పౌరులు కూడా యుద్ధంలో భారీ సంఖ్యలో చనిపోతున్నారు. రష్యా క్షిపణి(Missiles) దాడిలో కారులో వెళ్తున్న వృద్ధ దంపతులు చనిపోయారు. ఉక్రెయిన్ సైనికులు ప్రయాణం చేస్తున్న వాహనంగా భావించిన రష్యా బలగాలు దాడి చేశాయి. మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది.
ముఖ్యంగా మరియాపోల్, కీవ్, ఖార్కీవ్, సుమీ నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా సైన్యం. అయితే రష్యా కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియాపోల్‌లో సామాన్య పౌరులను రష్యా బలగాలు టార్గెట్ చేస్తున్నాయని చెబుతోంది. 3 లక్షల మంది పౌరులను మరియాపోల్‌లో రష్యా సైన్యం బంధించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ నుంచి 20 లక్షల మంది శరణార్దులు పొరుగుదేశాల్లో తలదాచుకుంటునట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
సుమీ నగరంపై భారీ బాంబులతో దాడులు చేసింది రష్యా. ఈ దాడిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. సుమీలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. యుద్ధంలో రష్యాను కోలుకోలేని దెబ్బతీస్తున్నామని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఇప్పటివరకు 13 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్టు తెలిపింది. 80 రష్యా హెలికాప్టర్లను కుప్పకూల్చామని, 300 ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. రష్యా దాడుల్లో కీవ్ సమీపంలోని ఇర్పిన్ పట్టణం సర్వనాశనం అయ్యింది. వందలాది స్కూళ్లు , విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. జైతోమిర్, చెర్నాఖివ్ నగరాల్లోని ఆయిల్ డిపోలపై రష్యా వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. మరోవైపు తాను దేశం విడిచిపారిపోయినట్టు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి తీవ్రంగా ఖండించారు. తాను ఉన్న లొకేషన్ వీడియోతో సహా విడుదల చేశారు.
Read Also…. Russia Ukraine Crisis: రష్యా చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు.. భారీగా ధరలు పెరిగే ఛాన్స్!
మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రేపటితో ఆపరేషన్ గంగా పూర్తి అవుతుందని తెలిపింది. సహాయక చర్యలను పర్యవేక్షించిన కేంద్రమంత్రులు గురువారం భారత్‌కు చేరుకుంటారు. గురువారం తరువాత ఎవరికి సాయం చేయలేని పరిస్థితి ఉంటుందని కేంద్రం తెలిపింది. భారతీయులంతా రేపటి లోగా ఉక్రెయిన్‌ను వదలాలి అని సూచించింది.
ఉక్రెయిన్‌లో దూకుడు మీద ఉన్న రష్యా యుద్ధట్యాంకులపై సడెన్‌గా సోవియట్ జెండాలు కనిపించాయి. రష్యా జాతీయపతాకాలను బదులుగా సోవియట్ జెండాలు తొలిసారి కనిపించడం చర్చనీయాంశమైంది. రష్యా విడుదల చేసిన వీడియోలో ఈ సోవియట్ జెండాలు కనిపించడం కీలకంగా మారింది.
రష్యా -ఉక్రెయిన్ యుద్దం సామాన్యులకు శాపంగా మారింది. యుద్దంలో దెబ్బతిన్న చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదం ముంగిట నిలిచింది . రష్యా దాడిలో 750 KV విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్‌కు నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచింది. ఇది ఇలాగే కొనసాగితే న్యూక్లియన్ ఇంధనం వేడెక్కి ఆవిరై, వాతావరణంలో రేడియేషన్ వ్యాపించే అవకాశముందని హెచ్చరికలు వస్తున్నాయి. బెలారస్, ఉక్రెయిన్, రష్యా, యూరప్‌కు ఈ రేడియేషన్ ముప్పు పొంచి ఉంది. న్యూక్లియర్ ప్లాంట్‌లో కూలింగ్ వ్యవస్థకు కేవలం రెండు రోజుల ఇంధనం మాత్రమే ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో బుధవారం వైమానిక దాడి సైరన్లు మోగింది. ఇది కాకుండా 12 నగరాల్లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ చేయబడింది. అదే సమయంలో రష్యా సైన్యం నుంచి ముప్పు పొంచి ఉన్న ప్రధాన నగరాల్లో భద్రతను పటిష్టం చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రటించారు
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. 3 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లకు ఆహారాన్ని అందించే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా వెల్లడించింది. యుద్ధం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఉక్రెయిన్‌తో పాటు అమెరికా మిత్రపక్షాలను కవ్విస్తోంది రష్యా. రష్యా యుద్ద ట్యాంకులపై సోవియట్ జెండాలను పెడుతోంది. ఉక్రెయిన్ ఆక్రమణతోనే యుద్దం ఆగదని సంకేతాలు ఇస్తోంది. సోవియట్ రిపబ్లిక్‌ల పునరేకీకరణ లక్ష్యంగా పుతిన్ వ్యూహాలు రచిస్తున్నారు. కీవ్ వైపు రష్యా యుద్ద ట్యాంకులు దూసుకొస్తున్నాయి. మూడు రోజుల్లో కీవ్… రష్యా వశమవుతుందని ప్రకటించింది అమెరికా. మరోవైపు రష్యా సైనికులు లొంగిపోవాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. తాము మాత్రం రష్యాకు లొంగేది లేదని తేల్చి చెప్పారు జెలెన్‌స్కీ.
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదంలో పడింది. రష్యా దాడితో ప్లాంట్‌కు 750 కేవీ విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్‌కు పవర్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో న్యూక్లియర్ ఫ్యూయల్ వేడెక్కి ఆవిరి అవుతుందనే భయం వెంటాడుతోంది. ఈ ఫ్యూయల్ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు విడుదలవుతాయి. అవి వాతావరణంలో కలసి రేడియేషన్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. బెలారస్, ఉక్రెయిన్, రష్యా, యూరప్ దేశాలకు ఈ రేడియేషన్ వ్యాపిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక పర్యటన చేపట్టనున్నారు. వచ్చే వారంలో కమలా హారిస్ ఆ దేశాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు.
అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేక చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నక్కజిత్తుల చైనా. ఓ వైపు రష్యాతో దోసీ కలుపుతూ మరోవైపు ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది. ఉక్రెయిన్‌కు 5 మిలియన్ యువాన్లు (సుమారు 7.91 లక్షల డాలర్లు) విలువైన ఆహార ధాన్యాలు.. ఇతర రోజువారీ అవసరాలను పంపుతున్నట్లు చైనా ప్రకటించింది. తూర్పు యూరోపియన్ దేశంపై సైనిక చర్యపై రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూన్నట్లుగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయానికి సంబంధించిన మొదటి రవాణాను బుధవారం అందజేశామని తెలిపారు. వీలైనంత త్వరగా మరో సరుకులను పంపుతామని తెలిపారు.
రష్యా దాడి కారణంగా ఇక్కడ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఉక్రెయిన్ చెర్నోబిల్ అణు కర్మాగారం ఉద్యోగులు వెల్లడించారు. చెర్నోబిల్ పవర్ ప్లాంట్.. దాని భద్రతా వ్యవస్థలకు విద్యుత్ పూర్తిగా నిలిపివేయబడిందని ఉక్రెయిన్ ఎనర్జీ ఆపరేటర్ ఉక్రానెర్గో బుధవారం ప్రకటించింది.
రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ప్రజలకు భారీ హామీ ఇచ్చింది. ఎలాంటి పరిస్తితుల్లో కూడా ప్రభుత్వాన్నికూల్చే ప్రసక్తి లేదని పేర్కొంది. అయితే ఆంక్షల పేరుతో అమెరికా తమ ఆర్ధిక యుద్ధం చేస్తోందని రష్యా మండిపడింది.
జపొరిజియాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిబ్బందిని రష్యా దళాలు హింసిస్తున్నాయని ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రి హెర్మన్ హలుషెంకో ఆరోపించారు. ఈ సిబ్బందిని నాలుగు రోజుల నుంచి నిర్బంధించారని బుధవారం ఆయన ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. తన నేరాలను కప్పిపుచ్చుకుని, సమర్థించుకునేందుకు ఈ సిబ్బంది చేత ఓ వీడియోను రికార్డు చేయించారని ఆరోపించారు.
10,000 డాటర్ల కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకునే కస్టమర్‌లు రూబిళ్లలో బ్యాలెన్స్ తీసుకోవాలని రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించినట్లు రాయిటర్స్ తెలిపింది. రష్యా ప్రజలపై రష్యా సెంట్రల్ బ్యాంక్ తీవ్ర ఆంక్షలు విధించింది.
❗️Central Bank of #Russia temporarily stops selling cash currency to citizens
Bank customers may withdraw not more than $10 thousand in cash. The rest is only in rubles at the market rate on the day of withdrawal.
There are queues at ATMs in #Moscow again. pic.twitter.com/whwajTw7Mx
— NEXTA (@nexta_tv) March 9, 2022
ఉక్రెయిన్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన 11 మంది పిల్లలకు వైద్యం అందించేందుకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. చిన్నారులతో కలిసి వచ్చిన కుటుంబాలు ఇజ్రాయెల్ చేరుకున్నారు. 11మంది పిల్లలు ఇజ్రాయెల్‌లోని ష్నైడర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించేందుకు ప్రారంభించిన ఆపరేషన్ గంగా కింద బంగ్లాదేశ్ పౌరులను సురక్షితంగా తరలించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 9 మంది బంగ్లాదేశ్ పౌరులను కూడా భారత్ రక్షించింది. నేపాల్, ట్యునీషియా ప్రజలను భారత్ అక్కడి నుంచి ఖాళీ చేయించింది.
Prime Minister of Bangladesh Sheikh Hasina thanks PM Narendra Modi for rescuing its 9 nationals from Ukraine under ‘Operation Ganga’. Nepalese, Tunisian students were also rescued under this operation: Government sources
(file photos) pic.twitter.com/lXcMt8zu4A
— ANI (@ANI) March 9, 2022
యుద్ధం జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌కు జపాన్ అండగా నిలిచింది. జపాన్ సముద్రంలో అరుదైన రక్షణ పరికరాల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ఉక్రెయిన్‌కు పంపింది.
Japan sends bulletproof vests to Ukraine in rare donation of defense equipment overseas https://t.co/jIGvpqclfC #UkraineRussiaWar #UkraineRussianWar #Ukraine #UkraineRussia #UkraineUnderAttaсk #UkraineWar
— Sue Stone (@knittingknots) March 9, 2022
ఉక్రెయిన్‌లోని ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్ ప్రకారం, రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించినప్పటి నుండి ఉక్రెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 1,335 కి పెరిగింది. ఇప్పటి వరకు 474 మంది పౌరులు మరణించగా, 861 మంది గాయపడ్డారు. 38 మంది చిన్నారులు మరణించగా, 71 మంది గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఏజెన్సీ పేర్కొంది.
The Office of the UN High Commissioner for Human Rights in #Ukraine @UNHumanRightsUA recorded 1,335 civilian casualties in the country (474 killed & 861 injured) between 24/02/2022, when #Russia’s armed attack against Ukraine started, & Monday 07/03/2022.https://t.co/WVe7Y3fmSL pic.twitter.com/R5PrTS5TRZ
— UN Human Rights (@UNHumanRights) March 8, 2022
ఉక్రెయిన్‌లో మానవతావాద కాల్పుల విరమణ విధిస్తున్నట్లు రష్యా సిబ్బంది చెప్పినట్లు వార్తా సంస్థ AFP తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఖార్కివ్, కైవ్, చెరెన్యివ్, మోరిపోల్‌లలో కాల్పుల విరమణ అమలు కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 5 గంటల పాటు వైమానిక దాడులు నిలిచిపోనున్నాయి.
సుమీపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమీ నుండి ప్రజలను స్థానిక అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వీడియో చూడండి..
Evacuation of people in #Sumy pic.twitter.com/Xyy0P62xqu
— NEXTA (@nexta_tv) March 9, 2022
సాంబో క్రీడలో ఉక్రెయిన్ ఛాంపియన్ ఆర్టియోమ్ ప్రైమెంకో(16), సుమీ నగరంలో జరిగిన వైమానిక దాడిలో మరణించారు. ఈ దాడిలో అతని ఇద్దరు తమ్ముళ్లతో సహా అతని కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.
?In #Sumy, 16-year-old Artyom Pryimenko, the champion of #Ukraine in sambo, was killed during an airstrike. His entire family died with him, including two younger brothers. pic.twitter.com/MAov4aobaX
— NEXTA (@nexta_tv) March 9, 2022
వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ యూరి అగర్కోవ్ ఉక్రేనియన్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు, రష్యాకు చెందిన మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ మరణించిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందడం రష్యాకు తీరనిలోటుగా భావిస్తున్నారు.
The commander of the reformed 33rd Motorized Rifle Regiment, Lieutenant Colonel or Colonel Yuri Agarkov, was reportedly killed in Ukraine. He was the previous Chief of Staff of the 56th Air Assault Brigade. https://t.co/3em3ikH85I
— ??UKRAINE? ??LATEST UPDATES (@UkraineDiary) March 9, 2022
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా ఆక్రమించిన తర్వాత, IAEAతో దాని సంబంధాలు తెగిపోయాయి. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన సేఫ్‌గార్డ్స్ మానిటరింగ్ సిస్టమ్ నుండి డేటా రావడం లేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ తెలిపారు.
International Atomic Energy Agency chief Rafael Grossi indicated that remote data transmission from safeguards monitoring systems installed at the Chernobyl Nuclear Power Plant had been lost. The plant is no longer transmitting data to the UN watchdog: AFP reports
— ANI (@ANI) March 9, 2022
ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. కీవ్ నగరంపై తూర్పు, సెంట్రల్ రీజియన్లపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరికొన్ని గంటల్లోనే కీవ్ నగారాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా సేనలు చేరుకున్నాయి.
ఉక్రెయిన్ నుంచి తనను ఖాళీ చేయించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థాన్ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు పాకిస్థాన్‌కు చెందిన అస్మా షఫీక్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో షాస్‌ను భారత అధికారులు రక్షించారు. దీంతో ఆమె పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళుతున్నారు. ఆమె తన కుటుంబంతో తిరిగి కలుస్తున్నారు. ఆమెకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.
Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp
— ANI (@ANI) March 9, 2022
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో వెల్లడించింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే అనేక దేశాలు రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. Castellum.ai అనే ప్రపంచ ఆంక్షల ట్రాకింగ్ డేటాబేస్ తాజాగా దేశాలపై ఉన్న ఆంక్షల జాబితాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరోపియన్ యూనియన్, నాటో దేశాలను మరోసారి హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు మారణాయుధాలు పంపుతున్నాయని అన్నారు. ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
ఆర్థికంగా, భద్రతా పరంగా, హ్యుమానిటేరియన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు బైడెన్. రష్యా నుంచి గ్యాస్, ముడిచమురు తీసుకోవద్దని అమెరికా, యూరప్ దేశాలను గతంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. చమురు ఎగుమతుల ద్వారా రష్యాకు పెద్ద ఎత్తున నగదు అందుతున్నందున పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై ఎక్కువగా లేదన్నారు బైడెన్. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా తన ఇంధన వినియోగంలో 8 శాతానికిపైగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తామంది అమెరికా.
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించింది. నిన్న వైట్‌హౌస్‌లో సమీక్షల తర్వాత తెరపైకి వచ్చిన బైడెన్.. కీలక ప్రకటన చేశారు. ఈయూ మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని, మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్ధం చేసుకోగలమన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్ స్పష్టం చేశారు