Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వందలాది మంది పౌరులు మరణించారు. 579 మంది పౌరులు(Civilians) మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (UNHCHR) తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 579 మంది పౌరులు మరణించారని,1,000 మందికి పైగా గాయపడ్డారని UNHCHR తెలిపింది. మరణించిన వారిలో 42 మంది చిన్నారులు కూడా ఉన్నారని UNHCHR శనివారం తెలిపింది. యుద్దంలో ప్రాణాలను కోల్పోయిన వారి వివరాలను జెనీవా(Geneva)లోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నమోదు చేసింది. ఇప్పటివరకు 564 మంది పౌరుల మరణించారని, 982 మంది గాయపడ్డారని తెలిపింది. పేలుడు ఆయుధాల వాడకం వల్లనే ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అసలు మృతుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు UN అధికారులు తెలిపారు.
అయితే, రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 1,300 మంది ఉక్రేనియన్ సైనికులు పోరాటంలో మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం తెలిపారు. ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవాలంటే రష్యా నివాస ప్రాంతాలతో సహా పౌరులను బాంబు దాడి చేసి చంపేసినట్లు జెలెన్‌స్కీ మీడియా సమావేశంలో చెప్పారు. రష్యా దాష్టిక చర్య వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, రష్యా ఇప్పటి వరకు దాదాపు 810 క్షిపణులను ప్రయోగించిందని గతంలో అమెరికా పేర్కొంది. రష్యా విమానాలు, ఫిరంగిదళాలు ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను లక్ష్యంగా చేసుకోగా, బాంబులు మరియు షెల్‌లు తూర్పున ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రాన్ని తాకాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు ఇప్పటికే నియంత్రణలో ఉన్న నగరాలపై దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారిని పాతిపెట్టకుండా నిరోధించారు. US రక్షణ అధికారులు రష్యా వైమానిక దాడులపై కీలక అననుమానం వ్యక్తం చేశారు. రష్యా పైలట్లు ఈ దాడి కోసం రోజుకు సగటున 200 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.
Read Also….