Russia Ukraine: 23 ఏళ్ల తర్వాత రష్యాకు పాక్ ప్రధాని.. యుద్దం వేళసమయంలో ఇమ్రాన్ పాకులాట ఎందుకు?
ఉక్రెయిన్ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటనపై అమెరికా స్పందించింది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాస్కో(Moscow) పర్యటనపై అమెరికా(America) స్పందించింది. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత ప్రపంచంలోని ప్రతి దేశంపైనా ఉందని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి అమెరికా తన వైఖరిని పాకిస్థాన్‌కు తెలియజేసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. నెడ్ ప్రైస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా పునరుద్ధరించిన దాడికి సంబంధించి మా వైఖరిని మేము పాకిస్తాన్‌కు తెలియజేశాము. యుద్ధంపై దౌత్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రయత్నాలను వారికి చెప్పామని ఆయన వెల్లడించారు.
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో తమ భాగస్వామ్యాన్ని అమెరికా ప్రయోజనాలకు ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ పర్యటన గురించి అమెరికా మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన ఏ దేశమైనా రష్యా చర్యకు వ్యతిరేకంగా గళం విప్పాలని పేర్కొంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ఆర్థిక సహకారంతో సహా పలు అంశాలపై చర్చించేందుకు పాక్ ప్రధాని బుధవారం మాస్కో వెళ్లారు. ఇది కాకుండా, ఎజెండాలో రెండు దేశాలు, తాలిబాన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్, ప్రాంతీయ భద్రతా సహకారంలో వారి పరస్పర ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఈ పర్యటనతో, ఇంధన రంగంలో, ప్రాంతీయ కనెక్టివిటీలో రష్యాతో కలిసి ముందుకు సాగడానికి పాకిస్తాన్ అవకాశం పొందవచ్చు.
23 ఏళ్ల తర్వాత తొలిసారిగా రష్యాకు పాక్ ప్రధాని రష్యా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న సంక్షోభం మధ్య రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలలోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతోంది. ప్రస్తుత తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన మొదటి విదేశీ నాయకుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మాస్కో చేరుకుంది. 1999 తర్వాత దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక పాక్ ప్రధాని రష్యాలో అధికారిక పర్యటనకు వచ్చారు. గతంలో 1999 మార్చిలో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ రష్యా పర్యటనకు వెళ్లారు.