Russia – Ukraine War: పుతిన్ వెనకున్నది ఆ ముగ్గురే.. యుద్ధానికి విరామం ఇచ్చింది కూడా అందుకేనట..!

|

Mar 06, 2022 | 7:54 PM

Russia - Ukraine War: త్రీ మాస్టర్‌ మైండ్స్‌.. వార్‌ జోన్‌లో ఇప్పుడు ఈ పాయింటే హాట్‌ టాపిక్‌. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి, తాజాగా వార్‌లో...

Russia - Ukraine War: పుతిన్ వెనకున్నది ఆ ముగ్గురే.. యుద్ధానికి విరామం ఇచ్చింది కూడా అందుకేనట..!
Putin
Follow us on

Russia – Ukraine War: త్రీ మాస్టర్‌ మైండ్స్‌.. వార్‌ జోన్‌లో ఇప్పుడు ఈ పాయింటే హాట్‌ టాపిక్‌. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి, తాజాగా వార్‌లో స్మాల్‌ బ్రేక్‌ ఇవ్వడానికి వెనుక ఆ ముగ్గురి వ్యూహరచనే కారణమనే ప్రచారం జరుగుతోంది. నీడను సైతం నమ్మని నియంతకు ఆ ముగ్గురే కళ్లు.. చెవులు.. గొంతుక అనేది టాక్‌. ఇంతకీ ఎవరా ముగ్గురు ఇప్పుడు చూద్దాం..

స్టాప్‌ ది వార్‌.. హెల్ప్‌ ప్లీజ్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌ స్కీ పదే పదే చేస్తోన్న అప్పీల్‌. మరి అటు పుతిన్‌ అంతరంగంలో ఎలాంటి చదరంగం నడుస్తోంది. 30 మంది కోటరిలో సలహాలు ఇస్తున్నారా? త్రీ మాస్టర్‌ మైండ్స్‌.. మరో లెవల్‌ వార్‌కు స్కెచ్‌ గీశాయా? సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ రష్యా ఎలాంటి వ్యూహాలు పదను తేలుతున్నాయి. అనే చర్చ ఎలా వున్నా. నడుస్తోన్న చరిత్రను బట్టీ పుతిన్‌.. సెక్యూరిటీ కౌన్సెల్‌ మాట వినేంత సీను ఇప్పుడు లేదనేది వార్‌కు ముందు వార్‌ పీరియడ్‌లో స్పష్టంగా కన్పిస్తోన్న సోషల్‌ డిస్టెన్స్‌ అందుకు నిదర్శనమట.

కౌన్సెల్‌ కన్నా తనకు ఎంతో నమ్మకస్తులైన సివోలిక్‌ గ్రూప్‌తోనే పుతిన్‌ డిస్కషన్స్‌ కొనసాగుతున్నాయట. వాట్‌ టు డూ అని గ్రూప్‌ డిస్కషన్‌ చేసినా.. చివరాఖరకు ఫైస్లా మాత్రం పుతిన్‌దే. కాకపోతే ఆ నిర్ణయం వెనుక ఆ ముగ్గురి సూచనలను పరిగణలోకి తీసుకుంటారట. పుతిన్‌కు అత్యంత నమక్మస్తులైన ఆ ముగ్గురినే త్రీ మాస్టర్ మైండ్స్ అని అంటారు.

త్రీ మాస్టర్‌ మైండ్స్‌లో ఫస్ట్‌ అండ్‌ ఫర్‌ మోస్ట్‌ పర్సన్‌.. నికోలయ్‌ పత్రుషెవ్‌. ఇతను పుతిన్‌ ఆత్మలాంటోడని పేరు. 1970 నుంచే వీళ్లది ధృడమైన బంధం. ఇద్దరు కేజీబీలో కొలిగ్స్‌. పుతిన్‌ తరువాత కేజీబీ చీఫ్‌గా పనిచేశారు నికోలయ్‌. రష్యా ఉనికికి గండి కొట్టేలా అమెరికా పావులు కదుపుతుందని పుతిన్‌ మనసులో వేసింది ఈ చెవేనట. ఉక్రెయిన్‌పై వార్‌ డిక్లేర్‌ చేయడం వెనుక నికోలయ్‌ది కీలక రోల్‌ అనే ప్రచారం జరుగుతోంది.

అలెగ్జాండ్ బొర్ట్‌నికోవ్..పుతిన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. కేజీబీ నుంచి ఇప్పటి వరకు పుతిన్‌ వెన్నంటే వున్నారు. FSB చీఫ్‌గా కీలక రోల్‌ పోషించారు ఈయన. అత్యంత కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో బొర్ట్‌నికోవ్ సలహాలను పరిగణలోకి తీసుకుంటారట పుతిన్‌. ఇక సెర్జీ నారిష్కిన్.. ఫారీన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌. పుతిన్‌కు నమ్మకస్తుల్లో ఒకరే. ఐతే పశ్చిమ దేశాలకు ఒక చాన్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించి.. పుతిన్‌ కోపాన్ని చవి చూశారనే ప్రచారం వుంది. అదెలా వున్నా రష్యా అంతర్గత వ్యవహారాల్లో.. పుతిన్‌‌పై విమర్శలను తిప్పికొట్టడంలో.. చాలా కీలకంగా పనిచేశారనే టాక్‌ వుంది.

సెర్జీ షోయిగు.. పుతిన్‌కు వెరీ వెరీ క్లోజ్‌ ఫ్రెండ్‌. డిఫెన్స్‌మినిస్టర్‌ కూడా. 2014లో క్రిమియాను ఆక్రమించడంలో వ్యూహరచన ఇతనిదే. ఇప్పుడు ఉక్రెయిన్‌పై నడుస్తోన్న యుద్దంలో.. పుతిన్‌కు కళ్లు చెవులు ఇతనేనట. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చీఫ్‌గా సెర్జీ షోయిగు.. యుద్ధ వ్యూహాల్లో అపర చాణిక్యుడని పేరుంది. రష్యా మిలిటరీ చీఫ్ వాలెరీ జెరాసిమోవ్.. పుతిన్‌కు నమ్మిన ఫ్రెండ్‌. ప్రస్తుతం బెలారస్‌లో మిలిటరీ ఆపరేషన్స్‌ను ఈయనే పర్యవేక్షిస్తున్నారు. పుతిన్‌ టీమ్‌లో మరో మాస్టర్‌ మైండ్‌ సెర్జీ లావరోవ్. పుతిన్‌ కేబినెట్‌లో కీలక మంత్రి. పుతిన్‌ తరపున రష్యా వాయిస్‌ వినిపించడంలో చురుకైన స్పోక్స్‌ పర్సన్‌. అందుకే ఈయన్ని పుతిన్‌కు గొంతులాంటి వారంటారు.

ఇంత వ్యవస్థ వుంది అంటే.. పుతిన్‌ ఆషామాషీగా ఏ నిర్ణయం తీసుకోడు. కళ్లు, చెవులు, గొంతుకలా అత్యంత నమ్మకమైన కోటరి వున్నప్పటికీ.. ఫైనల్‌ నిర్ణయం పుతిన్‌దే. పుతిన్‌ ది లీడర్‌. ఫ్రమ్‌ కేజీబీ. నీడను కూడా నమ్మని నియంత అనే ఆరోపణలు ఎటూ వున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంతో.. పుతిన్‌పై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలు, వ్యూహాలు ఎలా వున్నా వేలమంది ప్రాణాలు.. చెల్లాచెదురైన జీవితాలు.. చరిత్రపై రక్తమరక.. ఈ యుద్ధ గర్జనతో పుతిన్‌ భావితరాలకు ఇచ్చే సందేశం ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమాధానంగా.. సంధితో వార్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతుందా? వార్ కంటిన్యూ అవుతుందా? అనే తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.

Also read:

Diabetes: మామిడి, అల్లం, ఉసిరి, పసుపుతో తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తిన్నారంటే..

Yogananda: భారతదేశపు అతి గొప్ప యోగుల మహాసమాధి.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు..

Allu Arjun: బన్నీతో ఛాన్స్‌ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ.. అదిరిపోయిన ప్రోమో..