Corona In Russia: రష్యాలో మరణ మృదంగం.. ఒక్క రోజులో 984 మంది మృతి..

|

Oct 13, 2021 | 7:50 PM

రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో గత 24 గంటల్లో 984 మంది వైరస్ సోకి మరణించినట్లు ప్రభుత్వ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ నివేదించింది...

Corona In Russia: రష్యాలో మరణ మృదంగం.. ఒక్క రోజులో 984 మంది మృతి..
Coronavirus
Follow us on

రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో గత 24 గంటల్లో 984 మంది వైరస్ సోకి మరణించినట్లు ప్రభుత్వ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ నివేదించింది. గత కొన్ని వారాలుగా రష్యావ్యాప్తంగా రికార్డు స్థాయిలో రోజువారీ మరణాల సంఖ్య నమోదవుతోంది. తాజాగా బుధవారం 28,717 కొత్త కేసులు వచ్చాయి. వ్యాక్సినేషన్ లేక మరణాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. దేశంలోని దాదాపు 146 మిలియన్ల మందిలో 29% మంది పూర్తిగా టీకా వేసుకున్నారని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ మంగళవారం తెలిపారు కరోనా రోగులతో అక్కి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్‌ సోకిన వారిలో 2,19,329 మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మైఖేల్‌ మురాస్కో తెలిపారు. ఇప్పటి వరకు 7.8 మిలియన్ల పాజిటివ్‌ కేసులు రాగా 2,19,329 మంది కరోనాకు బలయ్యారు.

వ్యాక్సినేషన్‌ స్పీడ్ పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారులను ఆదేశించారు. అక్కడ వ్యాక్సిన్లపై జరుగుతున్న దుష్ప్రచారంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకు రావటం లేదు. దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవటంతో పాటు వైరస్ సోకి మృతి చెందుతున్నా వారి సంఖ్య పెరిగింది. దీంతో ఆ దేశంలో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని క్రెమ్లిన్‌ ఖండించారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిట్టుందని చెప్పారు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ జన సమహాల కార్యక్రమాలపై మాత్రం ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా తీసుకున్న వారితో పాటు ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు లేదా కొవిడ్ నెగెటివ్‌ నివేదిక చూపించిన వారిని మాత్రమే అనుమతించాలని యాజమాన్యలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరణాలకు రోస్‌స్టాట్, వైరస్ ప్రధాన కారణం అక్కడి అధికారులు చెబుతున్నారు.

Read Also.. Myanmar: మయన్మార్‎లో దారుణం.. తిరుగుబాటుదారుల ఘర్షణలో 30 మంది సైనికులు మృతి..