Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌.. కార్నివాక్‌ కోవ్‌ పేరిట టీకా..!

|

May 28, 2021 | 11:56 AM

Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది రష్యా. కార్నివాక్ కోవ్ పేరిట అభివృద్ది చేసిన టీకాతో ఆరు నెల‌ల వ‌ర‌కు..

Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌.. కార్నివాక్‌ కోవ్‌ పేరిట టీకా..!
Covid 19 Vaccine For Animals
Follow us on

Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది రష్యా. కార్నివాక్ కోవ్ పేరిట అభివృద్ది చేసిన టీకాతో ఆరు నెల‌ల వ‌ర‌కు రక్షణ ఉంటుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మానవుల్లో మాత్రమే కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం జంతువులకూ వ్యాక్సిన్‌ తీసుకువచ్చింది రష్యా. ఇప్పటికే వాటిపై పరిశోధనలు పూర్తి చేసి వ్యాక్సిన్‌ను రిజిస్టస్‌ సైతం చేసుకున్నట్లు రష్యా తెలిపింది. ఈ నేపథ్యంలో కార్నివాక్ వ్యాక్సిన్​ను ఇదివరకు కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం వెల్లడించింది. ఇది జంతువుల్లో ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. పెంపుడు జంతువులకు టీకాలను అందించేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెటర్నరీ విభాగం తెలిపింది. టీకాల కోసం క్లినిక్​లను సంప్రదిస్తున్నారని చెప్పారు. భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఇదివరకు తెలిపింది. రష్యా వెటర్నరీ విభాగం అనుబంధ సంస్థ నుంచి 17 వేల డోసులతో తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. అయితే ఈ వ్యాక్సిన్‌కు డిమాండ్‌ భారీగా ఉంది. మొదటి బ్యాచ్‌ టీకాలను దేశంలోనే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, దాన్ని 50 లక్షలకు పెంచుతామని వివరించారు. అయితే ఈ టీకా ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Covid-19: కోవిడ్‌-19 ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగించాలి.. రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

Corona In AP: ఏపీ ప్రజలకు ఊరట.. 10 జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం.. వివరాలివే.!