Russia Ukraine Crisis: మా మాట వింటే.. తక్షణమే యుద్ధం ఆపేస్తాం.. రష్యా సంచలన ప్రకటన

|

Mar 07, 2022 | 8:48 PM

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు ఓకే చెబితే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తక్షణమే నిలిపివేస్తామంటూ ప్రకటించింది.

Russia Ukraine Crisis: మా మాట వింటే.. తక్షణమే యుద్ధం ఆపేస్తాం.. రష్యా సంచలన ప్రకటన
Russia Ukraine Crisis
Follow us on

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు ఓకే చెబితే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తక్షణమే నిలిపివేస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రతినిధి వెల్లడించారు. యుద్ధం ముగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రష్యా.. ఉక్రెయిన్‌కు కొన్ని షరతులు కూడా విధించింది. 12 రోజుల నుంచి రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు దఫాలుగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపాలంటూ ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా రష్యాకు సూచిస్తున్నాయి. అయినప్పటికీ రష్యా వినకుండా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రజలు బయటి దేశాలకు వెళ్లేందుకు నిన్న కొన్ని గంటలపాటు రష్యా యుద్దాన్ని సైతం నిలిపివేసింది. ఈ క్రమంలో మూడో విడత చర్చలకు ముందు రష్యా కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు అంగీకరిస్తే తక్షణం సైనిక చర్య ఆపేస్తామంటూ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ (Dmitry Peskov) స్పష్టంచేశారు. మరికాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చలు జరగనున్న క్రమంలో రష్యా నుంచి ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ మేరకు పెస్కోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై తక్షణం సైనిక చర్యను ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ.. అందుకు ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించాల్సి ఉంటుందంటూ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని, ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరకుండా ఉండాలని పెస్కోవ్ స్పష్టం చేశారు. ఈ షరతులకు ఉక్రెయిన్ అంగీకరిస్తే సైనిక చర్యను నిలిపేస్తామంటూ స్పష్టంచేశారు.

Also Read:

Viral Video: యుద్ధం మమ్మల్ని విడదీయలేదు.. రణ క్షేత్రంలోనే ఒక్కటైన ఉక్రెయిన్ ప్రేమ జంట.. వీడియో

Russia Ukraine crisis: భారీగా పతనమైన రూపాయి.. క్రూడ్‌ ఆయిల్ ధర పెరుగుదలే కారణమా..