Rishi Sunak: రిషి కుటుంబానికి గోల్డెన్‌ డేస్‌.. భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌.. ఎంతంటే.?

|

Oct 26, 2022 | 7:39 AM

బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు గోల్డెన్‌ డేస్‌ నడుస్తున్నాయి. లేటెస్ట్‌గా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌ దక్కింది.

Rishi Sunak: రిషి కుటుంబానికి గోల్డెన్‌ డేస్‌.. భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌.. ఎంతంటే.?
Rishi Sunak Akshata Murty
Follow us on

బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు గోల్డెన్‌ డేస్‌ నడుస్తున్నాయి. లేటెస్ట్‌గా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌ దక్కింది. అక్షత ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె. అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో భారీగా షేర్లు ఉన్నాయి. 2022 సంవత్సరానికి గానూ అక్షతకు తన వాటాలపై డివిడెండ్‌ రూపంలో 126.61 కోట్ల ఆదాయం లభించింది. అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.93 శాతం మేర వాటా ఉంది. ఆమె పేరిట 3.89 కోట్ల షేర్లు ఉండగా.. వాటి విలువ 5,956 కోట్లు. ఈ ఏడాది మే 31న 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ ఒక్కో షేరుపై 16 చొప్పున డివిడెండ్ చెల్లించింది. మే నుంచి అక్టోబరు వరకు 16.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఒక్కో షేరుపై మొత్తం డివిడెండ్ 32.5 కాగా, అక్షత మూర్తికి తన వాటాలపై డివిడెండ్‌ రూపంలో 126.61 కోట్ల ఆదాయం వచ్చింది.

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సంచలనం సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా.. బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓవైపు.. బ్రిటన్‌ ప్రధానిగా భర్త ఎన్నిక.. మరోవైపు ఇన్ఫోసిస్‌ నుంచి డివిడెండ్‌ ప్రకటనతో అక్షతామూర్తి ఆనందంలో మునిగిపోయారు.

కాగా.. గతంలో పన్నుల చెల్లింపు విషయంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతామూర్తిపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో.. తాను ప్రపంచ వ్యాప్తంగా సంపాదించే సంపాదనపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తానని ప్రకటించారు.. అయితే.. పన్ను చెల్లించారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..