Rai Typhoon: ఫిలిప్పీన్స్‌‌లో ‘’రాయ్‌’’ తుఫాను విధ్వంసం.. 31మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!

|

Dec 19, 2021 | 7:58 AM

Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌‌లో ‘'రాయ్‌'’ తుఫాను(Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. భారీ తుఫాను ధాటికి 31మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Rai Typhoon: ఫిలిప్పీన్స్‌‌లో ‘రాయ్‌’ తుఫాను విధ్వంసం.. 31మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!
Philippines Typhoon
Follow us on

Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌‌లో ‘’రాయ్‌’’ తుఫాను(Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. భారీ తుఫాను ధాటికి 31మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావం ఎక్కువగానే చూపింది. వేలకోట్ల ఆస్తినష్టం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది.

ప‌ర్యాట‌క దేశమైన ఫిలిప్పిన్స్‌లో రాయ్ టైపూన్ విలయంతో అనేక అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గంటకు 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు వీయడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం నెలకొంది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భారీగా వరదలు ముంచెత్తడంతో ఊళ్లకు ఊళ్లు నీటమునిగాయి. అయితే, మరణాలకు సంబంధించి పూర్తిగా సమాచారం లేదని, ఇప్పటి వరకు 31 మంది వరకు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ ప్రధాన విపత్తు ప్రతిస్పందన ఏజెన్సీ మరణాలు తక్కువగానే ఉన్నాయని నివేదించింది. చెట్లు కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది.

ఇప్పటివరకు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్​ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను బీభత్సానికి తమ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్​ఐలాడ్స్​ప్రావిన్స్​గవర్నర్ బగావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టామన్నారు. అయితే, ఆహారం, మంచినీళ్లు, తాత్కాలిక షెడ్లు, పరిశుభ్రత కిట్లు, మందులు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దక్షిణ, కేంద్ర ఫిలిప్పీన్స్​లోని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రాయ్​ తుపాను శుక్రవారం రాత్రి తీరం దాటి దక్షిణ చైనా సముద్రం వైపు కదిలిందని అధికారులు వెల్లడించారు.

Read Also…  Delhi Weather: ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత.. నేడు, రేపు శీతలగాలులు వీచే అవకాశం.. పడిపోయిన ఉష్ణోగ్రత