Sri Lanka: మాల్దీవులకు చేరిన నిరసనలు.. గొటబాయను వెనక్కి పంపాలంటూ ప్రెసిడెంట్ భవన్ ఎదుట ఆందోళన

|

Jul 14, 2022 | 4:07 PM

శ్రీలంకను (Sri Lanka) అట్టుడుకుంచిన నిరసనలు ఇప్పుడు మాల్దీవులకు తాకాయి. మాల్దీవ్ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ అధికారిక నివాసం ఎదుట శ్రీలంక వాసులు ఆందోళన చేపట్టారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు....

Sri Lanka: మాల్దీవులకు చేరిన నిరసనలు.. గొటబాయను వెనక్కి పంపాలంటూ ప్రెసిడెంట్ భవన్ ఎదుట ఆందోళన
Protses At Maldieves
Follow us on

శ్రీలంకను (Sri Lanka) అట్టుడుకుంచిన నిరసనలు ఇప్పుడు మాల్దీవులకు తాకాయి. మాల్దీవ్ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ అధికారిక నివాసం ఎదుట శ్రీలంక వాసులు ఆందోళన చేపట్టారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. కాగా.. శ్రీలంక నుంచి మాల్దీవులకు (Maldives) చేరుకున్న గొటబాయ తాజా నిరసనలతో మాల్దీవుల నుంచి దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున గొటబాయ, ఆయన భార్య సహా ఇద్దరు బాడీ గార్డులతో కలిసి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు. ప్రజాగ్రహం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 13న వైదొలగుతానని ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో రాజీనామా చేయకుండా దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దీంతో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. గోటబయ వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.

గొటబయ రాజపక్స బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించడంతో సుజిత్‌ ప్రేమదాస అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. ఎస్‌జేబీ పార్టీ అధ్యక్షుడైన ప్రేమదాస ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శ్రీలంకలో పదవులు చేపట్టడానికి నాయకులందరూ భయపడుతున్న వేళ ప్రేమదాస ముందుకురావడం విశేషం. కాగా ఈ నెల 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. శ్రీలంక అధ్యక్ష భవనం నిరసనకారులకు అడ్డాగా మారింది. నాలుగు రోజుల కిందట ప్రెసిడెంట్‌ ప్యాలస్‌ను ఆక్రమించిన నిరసనకారులు దాన్ని పిక్నిక్‌ స్పాట్‌గా మార్చేశారు.

అంతకు ముందు గొటబయ రాజపక్స సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స కూడా దుబాయ్‌ పారిపోవడానికి ట్రై చేశారు. రాజకపక్స సోదరులెవరూ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించాలని కోరుతూ శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ వార్తల కోసం..