Sri Lanka Crisis: కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు.. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు సంచలన నిర్ణయం
Sri Lanka Emergency Crisis: కొలంబో వీధుల్లో సైన్యంతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. హెలికాప్టర్లతో కూడా ఆందోళనకారులపై నిఘా పెట్టారు.
శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మొన్న అధ్యక్ష భవానాన్ని ఆక్రమించిన ఆందోళనకారులు తాజాగా ప్రధాని కార్యాలయాన్ని ఆక్రమించారు. కొలంబోలో చాలా ఉద్రిక్త పరిస్థితులు కన్పిస్తున్నాయి. శ్రీలంక జెండాలతో ప్రధాని కార్యాలయం పైకి ఎక్కారు ఆందోళనకారులు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని ఆందొళనకారులు పట్టుబడుతున్నారు. కొలంబో వీధుల్లో పలుచోట్ల ఆందోళనకారులకు , సైన్యానిక మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణలో గాయపడ్డ 30 మందిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపు చేయడానికి గాలి లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువును రూడా ప్రయోగించారు. అయినప్పటికి ఆందోళకారులు వెనక్కి తగ్గడం లేదు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో ఆయన స్థానంలో రణిల్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన విక్రమసింఘ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రణిల్ విక్రమసింఘే తీరుపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కూడా రాజపక్స లాగే విదేశాలకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది.
అయితే రాజపక్స విదేశాలకు పారిపోయినప్పటికి శ్రీలంక పౌరుల ఆగ్రహం చల్లారడం లేదు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారుల పైకి భాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపు చేయడానికి స్పెషల్ కమెండోలను రంగం లోకి దింపారు. కొలంబో వీధుల్లో సైన్యంతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. హెలికాప్టర్లతో కూడా ఆందోళనకారులపై నిఘా పెట్టారు.
శ్రీలంలో శాంతియుత అధికార మార్పిడికి కొన్ని ఫాసిస్ట్ శక్తులు అడ్డుపడుతున్నాయని- తాత్కాలిక దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే విమర్శించారు. పరిస్థితులు చక్కబడేందుకే ఎమర్జెన్సీతోపాటు కర్ఫ్యూని ప్రకటించినట్లు ప్రత్యేక వీడియో సందేశంలో చెప్పారాయన. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకోసం శుక్రవారం అన్నిపార్టీల నేతలు సమావేశం అవుతున్నట్లు రణిల్ విక్రమసింఘే చెప్పారు.