Prince Charles: మరోసారి వార్తల్లోకి బ్రిటన్‌ రాజవంశం.. ఖతర్‌ నుంచి మూడు మిలియన్ల యూరోల నగదు తీసుకున్న ప్రిన్స్‌ ఛార్లెస్‌..

| Edited By: Phani CH

Jun 28, 2022 | 7:18 AM

బ్రిటన్‌ రాజవంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. యువరాజు ఛార్లెస్‌ ఖతర్‌ మాజీ ప్రధాని షేక్‌ హమద్‌ బిన్‌జసిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌థానీ నుంచి దాదాపు మూడు మిలియన్ యూరోల నగదు సూట్‌కేస్‌ రూపంలో తీసుకున్నారని

Prince Charles: మరోసారి వార్తల్లోకి బ్రిటన్‌ రాజవంశం.. ఖతర్‌ నుంచి మూడు మిలియన్ల యూరోల నగదు తీసుకున్న ప్రిన్స్‌ ఛార్లెస్‌..
Prince Charles
Follow us on

బ్రిటన్‌ రాజవంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. యువరాజు ఛార్లెస్‌ ఖతర్‌ మాజీ ప్రధాని షేక్‌ హమద్‌ బిన్‌జసిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌థానీ నుంచి దాదాపు మూడు మిలియన్ యూరోల నగదు సూట్‌కేస్‌ రూపంలో తీసుకున్నారని లండన్‌కు చెందిన సండే టైమ్స్‌, ది మెయిల్‌ పత్రికలు వెల్లడించాయి. ఈ మొత్తం భారత కరెన్సీలో 24 కోట్ల 89 లక్షల రూపాయలు.. 2011 మరియు 2015 మధ్య కాలంలో ఛార్లెస్‌కు ఈ మొత్తం అందింది.. మూడు విడతలుగా అందిన ఈ డబ్బు ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఛారిటబుల్‌ ఫండ్‌’లో జమైందని తెలుస్తోంది. ఈ ఫండ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఛారిటీ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.. అయితే షేక్‌ హమద్‌ బిన్‌జసిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌థానీ నుంచి అందిన ఈ విరాళం చట్ట విరుద్దమని వార్తా కథనాల్లో ఎక్కడా చెప్పలేదు.. సండే టైమ్స్‌, ది మెయిల్‌ కథనాలు సంచలనం సృష్టించడంతో క్లారెన్స్ హౌజ్ విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశం ఉందనే వార్తలు వచ్చాయి

కాగా ఈ విషయంపై క్లారెన్స్‌ హౌస్‌ నుంచి వివరణ కూడా వెలువడింది. ఈ విరాళాలు యువరాజు ఆధ్వర్యంలోని ఛారిటీ సంస్థలో జమయ్యాయయని, ఇందు కోసం సక్రమమైన ప్రక్రియనే అనుసరించారని తెలిపింది. ఆడిటర్ల సంతకాలు కూడా ఉన్నాయని, ఎక్కడా వివాదానికి అవకాశం లేదని క్లారెన్స్‌ హౌస్‌ వివరణ ఇచ్చింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ 1979లో ఏర్పాటైంది.. ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ కార్యక్రమాల కోసం నిధులను కేటాయిస్తుంది. రాజ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారి ప్రాజెక్టులకు దీని నుంచి గ్రాంటు అందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..