జపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు సంభవించినట్లుగా పేర్కొంది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా ఈ భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని అక్కడి అధికారిక వర్గాలు వెల్లడిచాయి. అయితే ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది.
An earthquake of magnitude 6 on the Richter scale hit near East Coast of Honshu, Japan at 05.28 am today: National Centre for Seismology
— ANI (@ANI) May 14, 2021
ఈ నెల ప్రారంభంలో జపాన్ ఈశాన్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. భూకంపం కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో 60 కిలోమీటర్ల లోతులో (37 మైళ్ళ కంటే ఎక్కువ) గుర్తించారు. టోక్యోతో సహా దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని జెఎంఎ తెలిపింది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పేరిట పిలిచే ఈ భూకంప జోన్‌లో జపాన్ ఉంది. దీంతో భారీ భూకంపాలు సంభవిస్తాయని ఇప్పటికే చాలాసార్లు అధికారులు ప్రకటించారు. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సునామీ రాగా.. 15వేల మందికి పైగా మృతి చెందారు. అలాగే ఫుకుషిమా అణు కర్మాగార విపత్తుకూ కారణమైంది. అయితే ఇప్పుడు ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి అధికారిక వర్గాలు అంటున్నాయి.