Alaska Earthquake: భూకంపంతో గజగజ వణికి పోయిన అలాస్కా… భీకర దృశ్యాలు చూడండి

అమెరికాలోని అలాస్కా భూప్రకంపనలతో వణికిపోయింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 8.2 మ్యాగ్నిట్యూడ్ గా యూఎస్ జియాలజికల్ పేర్కొంది. అలాస్కాకు సుమారు 90 కి.మీ. దూరంలోని పెరీవిల్లేలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Alaska Earthquake: భూకంపంతో గజగజ వణికి పోయిన అలాస్కా... భీకర దృశ్యాలు చూడండి
Earthquake Strikes Off Alaska

Edited By:

Updated on: Jul 29, 2021 | 5:48 PM

అమెరికాలోని అలాస్కా భూప్రకంపనలతో వణికిపోయింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 8.2 మ్యాగ్నిట్యూడ్ గా యూఎస్ జియాలజికల్ పేర్కొంది. అలాస్కాకు సుమారు 90 కి.మీ. దూరంలోని పెరీవిల్లేలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత కారణంగా మరో మూడు, నాలుగు గంటల్లో సునామీ సంభవించే సూచనలు ఉన్నాయని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టం కూడా హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల సముద్రపుటలలు ఉవ్వెత్తున ఎగసిపడుతాయని, సమీప గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలని. ఇప్పటి నుంచే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం మంచిదని ఈ వ్యవస్థ సూచించింది. అలాస్కాకు దాదాపు 500 మైళ్ళ దూరంలోని పెరీవిల్లే ఓ చిన్న గ్రామం. గత అక్టోబరులో ఇక్కడ 7.5 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు.

1964 మార్చిలో అలాస్కాలో 9.2 మ్యాగ్నిట్యూడ్ తో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 250 మందికి పైగా మరణించగా వేలమంది గల్లంతయ్యారు. నాటి ఆ ఉత్పాతాన్ని నేటికీ ప్రజలు మరిచిపోలేదు. తాజాగా అమెరికా సునామీ హెచ్చరికల విభాగం ఇచ్చిన వార్నింగ్ అప్పుడే సమీప గ్రామాలవారిని, తీర ప్రాంతవాసులను తీవ్ర భయాందోళనలో ముంచెత్తుతోంది. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం ప్రారంభమైంది. కోస్తా ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటామని జియాలాజికల్ సర్వే విభాగం కూడా ప్రకటించింది.

 

 

మరిన్ని ఇక్కడ చూడండి: Breaking: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు్: కేంద్రం

US Covid Cases: అమెరికాను మళ్ళీ వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 88 వేలకు పైగా కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ