Police Viral Video: ముద్దు పెడితే కేసు పెట్టకుండా మాఫీ చేస్తా.. లేదంటే కేసు పెట్టి లోపలేస్తానంటూ పోలీస్ ఆఫీసర్ ఓ యువతిని బెదిరించాడు. ఇక చేసేదేమీ లేక ఆ యువతి పోలీసోడికి అధర చుంబన ఇచ్చింది. ఇంత చెత్తపని చేసిన అతడు దొరక్కుండాపోతాడా.! సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ తతంగం మొత్తం రికార్డు కావడంతో పైఅధికారులు ఆ పోలీస్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన పెరూ దేశ రాజధాని అయిన లిమాలో చోటు చేసుకుంది.
అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ప్రజలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అయితే రాత్రి సమయంలో ఓ యువతి కరోనా నిబంధనలను అతిక్రమించి బైటికి వచ్చింది. ఆమెను ఓ పోలీసు అడ్డగించాడు.. ”రూల్స్ బ్రేక్ చేసి బైటికి వచ్చావు. నీమీద కేసు పెడతా. ఒకవేళ కేసు పెట్టకుండా ఉండాలంటే మాత్రం నాకు కిస్ ఇవ్వాలి. అప్పుడే వదిలేస్తా’ అంటూ బెదిరించాడు.
దీనితో ఆ యువతి చేసేదేమీ లేక పోలీసోడికి లిప్ కిస్ పెట్టింది. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో బండారం బయటపడింది. ఆ వీడియోను చూసిన పైఅధికారులు అతడ్ని ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆమెపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.
Also Read: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..