PM Narendra Modi: జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపండి.. పుతిన్‌కు ప్రధాని మోదీ సూచన

|

Mar 07, 2022 | 3:56 PM

PM Modi spoke Putin: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. 12 రోజులుగా రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా భీకర పరిస్థితి కనిపిస్తోంది.

PM Narendra Modi: జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపండి.. పుతిన్‌కు ప్రధాని మోదీ సూచన
Pm Narendra Modi
Follow us on

PM Modi spoke Putin: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. 12 రోజులుగా రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా భీకర పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. సోమవారం ఇరు దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంభాషించారు. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలని.. ఇంకా యుద్ధం వద్దని సూచించారు. దీనికోసం ఇరు దేవాధినేతలతో శాంతియుతంగా నేరుగా చర్చలు జరుపుకోవాలంటూ రష్యా అధ్యక్షడు వ్లాదమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి సూచించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జెలెన్‌స్కీతో సంభాషించిన అనంతరం ప్రధాని మోదీ దాదాపు 50 నిమిషాల పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ భేటీలో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్, రష్యా జట్ల మధ్య చర్చల స్థితిగతులపై అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. తమ బృందాల మధ్య జరుగుతున్న చర్చలతోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. సుమీతో సహా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా దృక్పథంతో ఆలోచించడంపై ప్రధాని మోదీ పుతిన్‌ను అభినందించారు. సుమీ నుంచి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడం గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో రష్యా స్పూర్తిగా నిలిచిందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామంటూ ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. అంతకుముందు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీతో మాట్లాడారు. వీరిద్దరి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోడీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దాదాపు అరగంటపైగా సాగిన ఈ ఫోన్ కాల్ ద్వారా మోడీ జెలెన్‌స్కీ‌తో పలు విషయాలు చర్చించారు. రష్యా-ఉక్రేయిన్ల (Russia-Ukraine War)మధ్య శాంతి చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రేయిన్ నుంచి భారత పౌరుల(Indian Citizens)ను తరలించడంలో చేస్తున్న సహాయానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సుమీ ప్రాంతంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా తరలింపులోనూ ఈ సాయం కొనసాగాలని జెలెన్ స్కీని కోరారు ప్రధాని మోడీ.

Also Read:

Russia – Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మోడీ..!

Russia-Ukraine War: 12రోజులుగా కొనసాగుతున్న యుద్ధం.. పుతిన్, జెలెన్‌స్కీతో మాట్లాడనున్న ప్రధాని మోడీ