Watch Video: ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన ఫ్రెంచ్ ప్రభుత్వం

|

Jul 14, 2023 | 3:03 PM

ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్యారిస్‌లో ల్యాండ్ అయిన ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్నే స్వయంగా విమానశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Watch Video: ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన ఫ్రెంచ్ ప్రభుత్వం
Pm Modi
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్యారిస్‌లో ల్యాండ్ అయిన ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్నే స్వయంగా విమానశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడే ప్రధాని సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రధాని మోదీని ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ పురస్కారంతో సత్కరించారు. అలాగే మోదీ కోసం ప్యారిస్‌లో ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసిన మేక్రాన్… మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించారు. ఫ్రెంచ్ పురస్కారాల్లో లేదా మిలటరీ అవార్డులలో ఇదే అత్యున్నత పురస్కరాం. అయితే ఇలాంటి పురస్కారం భారత ప్రధానికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గురువారం రాత్రి ప్రధాని మోదీ.. ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయలతో భేటీ అయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగంతో పాటు అనేక విషయాలను వారితో ప్రధాని చర్చించారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంటింగ్ మొదలైందని.. శ్రీహరి కోట నుంచి రాకెట్ ప్రయోగించబోతున్నట్లు తెలిపారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇది మైలురాయిగా నిలిస్తుందని చెప్పారు. అలాగే వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా భారత్ పరుగులు తీస్తోందని అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

వివిధ దేశాల్లో స్థిరపడిపోయిన భారతీయులకు అన్ని సదుపాయలు, భద్రత కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఉక్రెయిన్, అఫ్ఘానిస్తాన్, సుడాన్ లాంటి దేశాల్లో నివసించే భారతీయులకు రక్షణ కోసం ఎప్పటికీ ముందుంటామని హామి ఇచ్చారు. ఫ్రాన్స్‌లో యూపీఐని వినియోగించేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. భారత టూరిస్టులు యూపీఐ చెల్లింపుల ద్వారా స్వదేశ కరెన్సీలో చెల్లించవచ్చని అన్నారు. మరో విషయం ఏంటంటే ఫ్రాన్స్‌లో చదువుకునే భారతీయులకు కూడా ప్రధాని తీపి కబురు చెప్పారు. అక్కడ మాస్టర్స్ చేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు 5 ఏళ్ల లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే మార్సెయిల్‌లో కొత్తగా కాన్సులేట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తమిళ తత్వవేత్త అయిన తిరువళ్లువార్ విగ్రహాన్ని సైతం ఆ దేశంలో ప్రతిష్టిస్తామని… కొన్ని వారాల వ్యవధిలోని పనులన్ని పూర్తి అవుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రధాని మోదీ ఫ్రాన్స్ నేషనల్ డే ఉత్సవాల్లో పాల్గొననున్నారు.