PM Modi: మన డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది.. నాడు జరిగిన కుట్రను భారత ప్రజలు తిప్పికొట్టారన్న ప్రధాని మోడీ..

| Edited By: Basha Shek

Jun 26, 2022 | 9:53 PM

PM Modi in Germany: ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే కుట్రలన్నింటికీ భారత ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. నేడు దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ సదుపాయం ఉందని.. 99 శాతం గ్రామాల్లో వంట గ్యాస్ వాడుతున్నారని ప్రధాని..

PM Modi: మన డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది.. నాడు జరిగిన కుట్రను భారత ప్రజలు తిప్పికొట్టారన్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. జర్మనీలోని (Germany) మ్యూనిచ్‌లో ప్రవాస భారతీయులను (Indian Diaspora) ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిందన్నారు. జీ-7 48వ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్నారు ప్రధాని మోడీ. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. “మీ అందరిలో భారతదేశ సంస్కృతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని నేను చూస్తున్నాను అని ప్రధాని ప్రసంగంలో పేర్కొన్నారు. మీ ఈ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఈ ప్రేమ, ఉత్సాహం, ఉత్సాహంతో భారతదేశంలో చూస్తున్న వారి ఛాతీ గర్వంతో నిండిపోయింది. ఈరోజు మరొక కారణం కూడా తెలిసింది. మనకు గర్వకారణమైన ప్రజాస్వామ్యం, ప్రతి భారతీయుడి డిఎన్‌ఎలో ఉన్న ప్రజాస్వామ్యం, ఈ సమయంలో నలభై ఏడేళ్ల క్రితం, ఆ ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టి, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగింది” అని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే కుట్రలన్నింటికీ భారత ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. నేడు దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ సదుపాయం ఉందని.. 99 శాతం గ్రామాల్లో వంట గ్యాస్ వాడుతున్నారని ప్రధాని తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు గత రెండేళ్లుగా ఉచిత రేషన్ అందిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు.

భారత్‌లో ప్రతి పది రోజులకు ఒక యూనికార్న్ (వంద కోట్ల డాలర్ల కంపెనీ) రూపొందుతోందని ఆయన వెల్లడించారు. గత శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంతో జర్మనీ, ఇతర దేశాలు లబ్ధి పొందాయన్న ప్రధాని మోడీ.. అప్పట్లో మన దేశం వలస రాజ్యంగా ఉండేదని.. అందుకే ఆ ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ

ఇప్పుడు భారత్ పారిశ్రామిక విప్లవం విషయంలో ముందుందన్నారు. ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని వెల్లడించారు. పది శాతం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. ఐదు నెలల క్రితం భారత్ ఈ టార్గెట్‌ను సాధించిందని ప్రధాని స్పష్టం చేశారు. పురోగతి సాధించడానికి, అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి, కలలను సాకారం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశమైన భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే 10-15 ఏళ్లు పడుతుందనే మాటలు వినిపించాయని.. కానీ ఇప్పటికే మన దేశంలో 197 కోట్ల డోసుల టీకాలు వేశామన్నారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కోట్ల టాయిలెట్లను నిర్మించిందని మోడీ తెలిపారు.

అంతర్జాతీ వార్తల కోసం