PM Modi: నోబెల్ అవార్డు గ్రహీతతో ప్రధాని మోదీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

|

Jul 11, 2024 | 6:56 AM

ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనలో భాగంగా నోబెల్ అవార్డు గ్రహీత ఆంటోన్ జైలింగర్ ను కలిశారు. కాసేపు ఆయనతో మాటామంతి నిర్వహించారు. దేశ పరిస్థితులు, భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతను గురించి సుదీర్ఘంగా చర్చించారు. క్వాంటం మెకానిక్స్‎లో అతని పనితీరు తనను ఎంతో ప్రేరేపించిందన్నారు మోదీ. ఈ విషయాన్ని తన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఎన్నో ఆవిష్కరణలకు, ఆవిష్కరణ కర్తలకు ఆయన మార్గనిర్థేశం అని కొనియాడారు.

PM Modi: నోబెల్ అవార్డు గ్రహీతతో ప్రధాని మోదీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
Pm Modi
Follow us on

ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనలో భాగంగా నోబెల్ అవార్డు గ్రహీత ఆంటోన్ జైలింగర్ ను కలిశారు. కాసేపు ఆయనతో మాటామంతి నిర్వహించారు. దేశ పరిస్థితులు, భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతను గురించి సుదీర్ఘంగా చర్చించారు. క్వాంటం మెకానిక్స్‎లో అతని పనితీరు తనను ఎంతో ప్రేరేపించిందన్నారు మోదీ. ఈ విషయాన్ని తన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఎన్నో ఆవిష్కరణలకు, ఆవిష్కరణ కర్తలకు ఆయన మార్గనిర్థేశం అని కొనియాడారు. నేషనల్ క్వాంటం మెకానిజం పట్ల ఆయనకు ఉన్న జ్ఙానం, అభిరుచి స్పష్టంగా కనిపించిందన్నారు. భారతదేశానికి అవసరమైన సాంకేతికత, ఆవిష్కరణలు గురించి ఆయనతో చర్చించానన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎలా అభివృద్ది చెందాలన్న అంశాలపై ఆంటోన్ జైలింగర్ తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా జైలింగర్ ఇచ్చిన పుస్తకాన్ని గురించి కూడా ప్రధాని మోదీ తన భావననను వ్యక్తం చేశారు. ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత చేతుల మీదుగా ‘డ్యాన్స్ ఆఫ్ ద ఫోటాన్స్’ (DANCE OF THE PHOTONS) అనే పుస్తకం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపడానికి తన వంతు కృషి చేస్తానని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మోదీకి ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాని వియన్నాలో పర్యటించడం 41 ఏళ్లలో తొలిసారి. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. ఆమె తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీనే. ఆస్ట్రియాలో సంగీతకారులు వందేమాతరం గీతంతో మోదీకి వెల్‌కమ్‌ చెప్పారు. ఆస్ట్రియా చాన్స్‌లర్‌ కార్ల్‌ నెహామర్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్‌ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్తుతం ఇరుదేశాలు దౌత్య సంబంధాలు ఏర్పాటుచేసుకొని 75ఏళ్లు పూర్తయినట్లు భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డర్‌ బెలెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడి రష్యా – ఉక్రెయిన్‌ యుద్దం ముగిస్తే మంచిదని అటు మోదీ, ఇటు నెహమర్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు. శాంతి సదస్సుల నిర్వహణకు తమ దేశం ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు నెహమర్‌. 19వ శతాబ్దంలోనే ప్రపంచశాంతికి ఆస్ట్రియా కృషి చేసిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వైద్య రంగంతో పాటు సోలార్‌ రంగంలో పరస్పరం సహకరించుకోవలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌కు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇరుదేశాలు కలిసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తాయి’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో తెలిపారు.అంతకుముందు ప్రధాని మోదీకి వియన్నా విమానాశ్రయంలో ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ స్కాలెన్‌ బర్గ్‌ స్వాగతం పలికారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఛాన్సలర్‌ కార్ల్ అక్కడి వ్యాపారవేత్తలతో కూడా భేటీ అయ్యారు. భారతీయ మూలాలున్న వ్యక్తులతో వియన్నాలో ప్రధాని భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..