AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cycle Journey: ఫ్రాన్స్‌ టూ ఇండియా.. సైకిల్‌ పైనే 16 వేల కిలోమీటర్లు జర్నీ.. ఆ వయసులోనూ ఏ మాత్రం తగ్గకుండా..

సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కొంత సమయం సైకిల్ తొక్కితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా తక్కువ దూరం వరకు..

Cycle Journey: ఫ్రాన్స్‌ టూ ఇండియా.. సైకిల్‌ పైనే 16 వేల కిలోమీటర్లు జర్నీ.. ఆ వయసులోనూ ఏ మాత్రం తగ్గకుండా..
France To India Cycling
Ganesh Mudavath
|

Updated on: Oct 22, 2022 | 5:53 PM

Share

సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కొంత సమయం సైకిల్ తొక్కితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా తక్కువ దూరం వరకు వెళ్లేందుకు సైకిళ్లను ఉపయోగిస్తుంటారు. స్కూల్ కు వెళ్లే చిన్నారులైతే రోజూ సైకిల్ పైనే వెళ్తుంటారు. చిన్నప్పటి నుంచి సైకిల్ నడపడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు, కండర బలానికి ఉపయోగపడుతుంది. అయితే ఎవరైనా రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుతారు. అంతకంటే ఎక్కువ దూరం సైకిల్ పై వెళ్లాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక కొండ ప్రాంతాల్లో సైకిల్ నడపడం చాలా కష్టం. అయితే.. ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏకంగా సైకిల్ పై దేశాలనే దాటేశారు. ఏంటీ నమ్మడం లేదా.. ఇది నిజమండి బాబోయ్.. కావాలంటే ఈ స్టోరీ చదివేయండి. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన మేరీ, ఇరిక్‌ అనే వీరిద్దరూ ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నారు.

అయితే అందరిలా ఫ్లైట్ లోనో, షిప్ లోనో కాకుండా వెరైటీగా ఉండాలని కోరుకున్నారు. అందుకు సైకిల్ ను మంచి సాధనంగా ఉపయోగించుకున్నారు. సైకిల్ పై భారత్ కు రావాలని డిసైడ్ అయ్యారు. అయితే వారి వయస్సు అప్పటికే 50, 60 ఏళ్లు. శరీరం సహకరిస్తుందా, లేదా అనే డౌట్ ను బ్రేక్ చేస్తూ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. ఇక లేట్ చేయకుండా 7 నెలల పాటు సైకిల్ పై ప్రయాణిస్తూ ముంబై మీదుగా కోల్‌కతాకు చేరుకున్నారు.

జీపీఎస్‌ ఆధారంగా ప్రయాణిస్తున్న వీరు వాకాడులో అక్టోబరు 21న ఇండియాకు చేరుకున్నారు. ఏడు నెలల పాటు సాగిన తమ ప్రయాణం సంతోషంగా సాగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరు ఫేమస్ అయిపోయారు. వీరి సైకిల్‌ యాత్రపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వయసులో అంతదూరం సైకిల్‌ యాత్ర చేయడం చాలా గొప్ప విషయం అని కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా వారికి తెలిసిన వారికి చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో ఫ్రాన్స్ నుంచి ఇండియాకు, అది కూడా సైకిల్ తొక్కుకుంటూ రావడం నిజంగా గ్రేట్ కదూ..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..