బాబ్బాబూ కాస్త లిఫ్ట్ ఇవ్వవూ.. అడవిలో వెళ్తున్న డ్రైవర్ కు వింత అనుభవం.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
ఘాటు రోడ్లు, అటవీ ప్రాంతాల్లో జర్నీ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు వచ్చి ఎటాక్ చేస్తాయో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా..

ఘాటు రోడ్లు, అటవీ ప్రాంతాల్లో జర్నీ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు వచ్చి ఎటాక్ చేస్తాయో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల తలుపులు వేసుకోవడం, కిటికీలు మూసేయడం, లైట్స్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ గా ఇంటికి చేరుకోవచ్చు. అయితే కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తూనే ఉంటుంది. సాధారణంగా అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై ఎక్కవ సంఖ్యలో ఏనుగులు సంచరిస్తుంటాయి. అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు దాటాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే అవి రోడ్డు దాటేటప్పుడు కొన్ని సార్లు వెహికిల్స్ అడ్డు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి వాహనదారులకు ఎటువంటి హాని కలిగించనప్పటికీ, అప్పుడప్పుడు వారికి ముచ్చెమటలు పట్టిస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రయాణీకులతో ఉన్న ఓ బస్సు ఫారెస్ట్ ఏరియాలోని రోడ్డు పై నుంచి వెళ్తోంది. అదే సమయంలో ఓ ఏనుగు అక్కడికి చేరుకుంటుంది. గజరాజును చూసిన బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యి.. బస్సును స్లో చేసుకుని వెనక్కు తిప్పేందుకు ట్రై చేస్తాడు. అయితే ఏనుగు మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా బస్సు వద్దకు వెళ్తుంది. అంతే కాకుండా తన తొండంతో డోర్ తీసేందుకు ట్రై చేస్తుంది. తననూ లోపలికి ఎక్కించుకోవాలని అడుగుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




#दिवाली की छुट्टियों में सभी जल्द से जल्द घर पहुँचना चाहते है… ? pic.twitter.com/xaC4ANg2Dy
— Dipanshu Kabra (@ipskabra) October 22, 2022
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్లిప్ కు ఇప్పటివరకు 52 వేలకు పైగా వ్యూస్, లైక్స్, రీట్వీట్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది, కాస్త స్థలం ఇవ్వు నాయనా..!’ అని ఒకరు, ‘ప్రతి ఒక్కరికీ ఇంటికి వెళ్లే హక్కు ఉందని’ మరొకరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి