AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ మృతి కేసులో సంచలన విషయాలు.. 15రోజుల క్రితం కాదు.. చనిపోయింది ఎప్పుడంటే..?

పాకిస్థానీ నటి హుమైరా మృతి కేసు కీలక మలుపు తిరిగింది. రెండు రోజుల క్రితం ఆమె తన ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు 15 రోజుల క్రితం మరణించి ఉండొచ్చని భావించారు. కానీ పోస్టు మార్టం రిపోర్టుతో పాటు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనుషుల్లో తగ్గుతున్న సంబంధాలకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది.

హీరోయిన్ మృతి కేసులో సంచలన విషయాలు.. 15రోజుల క్రితం కాదు.. చనిపోయింది ఎప్పుడంటే..?
Humaira Asghar Ali
Krishna S
|

Updated on: Jul 11, 2025 | 3:50 PM

Share

పాకిస్థాన్ నటి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మరణించింది 15రోజుల క్రితం కాదని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..? పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ ఇటీవలే తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. 32 ఏళ్ల హుమైరా గత కొన్నేళ్లుగా కరాచీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుంది. కొన్ని నెలల నుంచి హుమైరా అద్దె చెల్లించడం లేదు. దీంతో విసుగు చెందిన యజమాని కోర్టుకు వెళ్లాడు. ఫ్లాట్‌ను చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు హుమైరా ఫ్లాట్‌కు వెళ్లగా.. ఆమె శవమై కనిపించింది. కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం లభించింది. అన్నీ డోర్లు లాక్ చేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తొలుత అనుమానించారు. కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టుతో పాటు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హుమైరా మరణించింది 15రోజుల క్రితం కాదని..అక్టోబర్ 2024లో మరణించినట్లు సమాచారం. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. ఆమె దాదాపు 9 నెలల క్రితం మరణించి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆమెను చుట్టుపక్కల వారు చివరి సారిగా చూసింది కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోనే.. అంతేకాకుండా బిల్స్ చెల్లించకపోవడంతో అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్‌కు కరెంట్ కట్ చేశారు. ఆమె ఫ్లాట్‌లో కరెంట్‌కు ప్రత్యామ్నాయం కూడా లేదు. అంతేకాకుండా ఫ్లాట్‌లో ఫుడ్ పదార్థాలు అన్నీ డేట్ అయిపోయాయి. పాత్రలు మొత్తం తప్పుపట్టిపోయాయి. ఆమె చివరి ఫోన్ కాల్ కూడా అక్టోబర్‌లో చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిన్నింటిని బట్టి హుమైరా చనిపోయి దాదాపు 9 నెలలు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హుమైరా మృతదేహాన్ని తీసుకోవడానికి తొలుత ఆమె ఫ్యామిలీ నిరాకరించినప్పటికీ.. తర్వాత ఆమె సోదరుడు మృతదేహాన్ని తీసుకునేందుకు వచ్చాడు. హుమైరా దాదాపు ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీకి వెళ్లిందని.. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇంటికి వస్తుందని సోదరుడు నవీద్ తెలిపారు. ఇలా చనిపోతుందని అనుకోలేదని చెప్పారు. కాగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏది ఏమైన ఓ యువతి మరణించి 9 నెలలు దాటినా ఆ విషయాన్ని గుర్తించకపోవడం మనుషుల్లో తగ్గుతున్న సంబంధాలకు అద్దం పడుతోంది.

కాగా లాహోర్‌కు చెందిన హుమైరా 2015 ప్రాంతంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె జస్ట్ మ్యారీడ్, ఎహ్సాన్ ఫరామోష్, గురు, చల్ దిల్ మేరే వంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. 2015 యాక్షన్ థ్రిల్లర్ జలైబీ, 2021లో లవ్ వ్యాక్సిన్ వంటి సినిమాల్లోను నటించింది. 2023 లో నేషనల్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డులలో బెస్ట్ ఎమర్జింగ్ టాలెంట్ అండ్ రైజింగ్ స్టార్ అవార్డును అందుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.