పాకిస్తాన్ నుంచి తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీ ఫైటర్లు గత నెలలో ప్రవేశించారని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం కూడా మద్దతునిస్తున్నాయని ఆయన చెప్పారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని ఆయన విమర్శించారు. తాష్కెంట్ లో జరిగిన సెంట్రల్, సౌత్ ఏసియా కనెక్టివిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఘని..ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఏ ప్రాంతాన్నీ ఆక్రమించుకోలేదని పాక్ చెబుతోందని. అసలు అలా జరగకుండా చూస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన ఆధీనంలోని సైన్యం ఇస్తున్న హామీలు వట్టి నీటి బుడగలుగా మారిపోతున్నాయన్నారు. మా దేశంలో తాలిబన్లు, వారి నెట్ వర్క్ లు, వారి సంస్థలు వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుని ఆస్తులను ధ్వంసం చేస్తూ బాహాటంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని అష్రాఫ్ ఘని ధ్వజమెత్తారు. సమస్యకు రాజకీయ పరిష్కారమొక్కటే మార్గమని వారు గుర్తించేంతవరకు మేము వారికీ కౌంటర్ ఇస్తూనే ఉంటాం అని ఆయన చెప్పారు.
కాందహార్ లో స్పిన్ బోల్టన్ జిల్లాను, ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లను టార్గెట్ చేసిన పక్షంలో..ఆఫ్ఘానిస్తాన్ వైమానిక దళంపై తాము మిసైళ్లను ప్రయోగిస్తామని పాక్ మిలిటరీ హెచ్చరించిందని ఆఫ్ఘన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అమాతుల్లా సాహేల్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. ఏ ఆధారంతో ఈ ఆరోపణ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇలా ఉండగా దోహాలో అఫ్గాన్ ప్రతినిధి బృందానికి, తాలిబన్ ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదంటున్నారు. వీటిని ప్రోత్సహించాలని ఆఫ్ఘన్ ప్రభుత్వం పాకిస్థాన్ ను కోరుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.