Donkeys Arrest: కోర్టుకు హాజరైన ఐదు గాడిదలు.. కారణం ఏంటో తెలుసా..?

|

Oct 23, 2022 | 10:57 AM

సాధారణంగా కోర్టులో మనుషులు మాత్రమే హాజరువుతారు. ఏదైనా తప్పు చేసినప్పుడు కేసును ఎదుర్కొంటున్న క్రమంలో కేసు విచారణ జరుపుతున్న సమయంలో..

Donkeys Arrest: కోర్టుకు హాజరైన ఐదు గాడిదలు.. కారణం ఏంటో తెలుసా..?
Donkeys
Follow us on

సాధారణంగా కోర్టులో మనుషులు మాత్రమే హాజరువుతారు. ఏదైనా తప్పు చేసినప్పుడు కేసును ఎదుర్కొంటున్న క్రమంలో కేసు విచారణ జరుపుతున్న సమయంలో పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పరుస్తారు. ఇలా రకరకాల కేసుల నేపథ్యంలో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంతా అందరికి తెలిసిన విషయమే. కానీ గాడిదలు కూడా కోర్టుకు హాజరు అయ్యాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ గడిదలు కోర్టుకు హాజరయ్యాయి.. ఏంటి గాడిదలు కోర్టుకు హాజరు కావడం ఏంటనేగా మీ అనుమానం. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. అసలు విషయానికొస్తే.. పాకిస్థాన్‌లోని చిత్రాల్‌ జిల్లా దరోశ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కోర్టులో గడిదలను హాజరు పర్చారు. కలప స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీటిని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. ఈ గాడిదలను అక్టోబర్‌ 20న కోర్టులో హాజరు పర్చారు. కలప స్మగ్లింగ్‌ కేసులు వీటిని పోలీసులు అరెస్టు చేశారు.

చిత్రాల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కలప దొంగతనం జరుగుతోంది. స్మగ్లింగ్‌ కారణంగా ఆ ప్రాంతంలో అడవులు కూడా వేగంగా అంతరించిపోతున్నాయని ఇప్పటికే నివేదికలు వెల్లడించాయి. ఈ కలప స్మగ్లింగ్‌ కేసులో ఐదు గాడిదలను దరోశ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తౌసిపుల్లా కోర్టులో హాజరు పర్చారు. కలపను తరలించడానికి ఈ గాడిదలను వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో వాటిని కోర్టుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విచారణ తర్వాత ఈ గాడిదలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కలపను అక్రమంగా రవాణా చేయడంలో గాడిదలను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ తౌసిపుల్లా సూచించారు.

తెల్లవారుజామున కలప అక్రమంగా రవాణా జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కలప రవాణాలో దారి వెంట ముగ్గురు తప్పించుకోగా, ఒకరు పట్టుబడ్డారు. గాడిదలపై కలప రవాణా చేస్తుండటంతో వాటిని పట్టుకుని అటవీ శాఖ అధికారికి అప్పగించినట్లు ఆయన వివరించారు. అయితే కలప రవాణాలో ఎన్ని గడిదలు ఉన్నాయో తెలిసేందుకు ఐదు గాడిదలను కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువచ్చిన గాడిదలను పోసు కస్టడీలో ఉంచడం కష్టం కాబట్టి వాటిని అటవీ శాఖకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలిసే వరకు వాటిని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి