AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘భారత్‌తో మాట్లాడదాం, POK, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరిస్తాం’.. దెబ్బకు దిగి వస్తున్న షాబాజ్ షరీఫ్!

ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK), వాణిజ్యం వంటి సమస్యలను భారతదేశంతో మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు. భారతదేశంతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు ఆయన చెప్పారు.

'భారత్‌తో మాట్లాడదాం, POK, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరిస్తాం'.. దెబ్బకు దిగి వస్తున్న షాబాజ్ షరీఫ్!
Pakistan Pm Shehbaz Sharif
Balaraju Goud
|

Updated on: Jun 25, 2025 | 8:17 PM

Share

ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK), వాణిజ్యం వంటి సమస్యలను భారతదేశంతో మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు. భారతదేశంతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు ఆయన చెప్పారు.

పాకిస్తాన్ వార్తా ఛానల్ ARY న్యూస్ ప్రకారం, షాబాజ్ షరీఫ్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సౌదీ అరేబియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్ భారతదేశంతో పీవోకే, సింధు జల ఒప్పందం, వాణిజ్యం, ఉగ్రవాదంపై చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌పై భారతదేశం కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులను తిరిగి పంపించడం, అట్టారి వాఘా సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీలకు సార్క్ వీసా మినహాయింపును నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదం, పీవోకే సమస్యను పరిష్కరించే వరకు, దానితో మరే ఇతర సమస్యను చర్చించబోమని భారతదేశం వైఖరి స్పష్టంగా ఉంది.

పాకిస్తాన్ సింధూ జల ఒప్పందం అంశాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)లోని 57 ముస్లిం దేశాల ముందు లేవనెత్తింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత వివిధ దేశాలకు పంపిన బిలావల్ భుట్టో జర్దారీ ప్రతినిధి బృందం భారతదేశంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నీటి అంశాన్ని కూడా లేవనెత్తారు. అయితే, పాకిస్తాన్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు అండగా నిలిచేందుకు ఆసక్తి చూపలేదు. ప్రపంచ దేశాల ముందు పరువు పోయినంత పనైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మెల్ల మెల్లగా దిగివస్తోంది.

65 సంవత్సరాల క్రితం 1960లో, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల పంపిణీకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాలకు చెల్లుతుంది. ఈ ఒప్పందం ప్రకారం, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్‌కు హక్కు ఉంది. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారతదేశానికి హక్కు ఉంది. ఈ విధంగా, భారతదేశానికి 20 శాతం నీరు, పాకిస్తాన్‌కు 80 శాతం నీరు లభిస్తాయి. ఈ కోణంలో, నీటి కోసం పాకిస్తాన్‌ ఎక్కువ ఆధారపడటం ఉంటుంది. అయితే సింధూ నది జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ తల్లడిల్లుతోంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, మే 6-7 తేదీల మధ్య రాత్రి భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. దీనితో ఆగ్రహించిన పాకిస్తాన్, భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకుంది. నూర్ ఖాన్ వంటి పాకిస్తాన్‌లోని పెద్ద వైమానిక స్థావరం భారతదేశం దాడిలో తీవ్రంగా నష్టపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చాలా పెరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..