Pakistan Parliament: పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేయాలంటే దడ పుట్టాల్సిందే..!

|

Nov 18, 2021 | 10:21 PM

Chemical Castration: అత్యాచార నిందితులకు శిక్ష విధించే విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో కఠిన శిక్షను అమల్లోకి తీసుకువచ్చింది.

Pakistan Parliament: పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేయాలంటే దడ పుట్టాల్సిందే..!
Pakistan
Follow us on

Chemical Castration: అత్యాచార నిందితులకు శిక్ష విధించే విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో కఠిన శిక్షను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కెమెకల్ కాస్ట్రేషన్ పనిష్‌మెంట్(లైంగికంగా పనికిరాకుండా చేయడం) ఇవ్వనున్నారు. నేరారోపణలను వేగంగా తేల్చడానికి, కఠిన శిక్షలను విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టాన్ని ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. పాకిస్తాన్‌లో ఇటీవలి కాలంలో స్త్రీలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యాచారాలను అరికట్టాలనే, కఠిన శిక్షలు వేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం.. ఈ కఠిన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తులకు కెమెకల్ కాస్ట్రేషన్ చేస్తారు. అలాగే, ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఏడాది క్రితమే తీసుకురాగా.. ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం లభించింది. 33 ఇతర బిల్లులతో పాటు క్రిమినల్ లా(సవరణ) బిల్లు 2021 ను కూడా పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. కెమికల్ కాస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో ఇంకెప్పుడూ లైంగిక సంపర్కానికి పాల్పడలేడు. అయితే, ఇది కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది.

అయితే, ఈ బిల్లును జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ వ్యతిరేకించారు. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇస్లాం విరుద్ధమని, షరియాకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. అయితే షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. కెమికల్ కాస్ట్రేషన్ అంటే లైంగిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడం. ఇలాంటి శిక్ష.. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా పలు దేశాల్లో ఉంది.

Also read:

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!