ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలకు మరో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. పాక్ ప్రభుత్వం వచ్చే 15 రోజుల్లో పెట్రోల్ ధరను రూ. 10 నుంచి రూ.14 కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. పెట్రల్ పై ధరలు పెంచేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కొన్ని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటరు పెట్రోల్ ధర రూ.272 ఉంది. ఒకవేళ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అమలు చేస్తే లీటరు పెట్రోల్ ధర రూ.286.77 కు ఎగబాకే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పన్నుల రేట్ల ఆధారంగానే పెట్రోల్ ధరల పెరుగుదల అంచనా వేయబడింది. ఇప్పటికే నిత్యావసరా ధరల పెరుగుదరలు, కరెంటు కోతలు లాంటి దారణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలకు తాజాగా పెట్రోల్ ధరలు కూడా మరింత పెంచే పరిస్థితి రావడం మరో గొడ్డలి పెట్టుగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.