ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని పాక్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలో వాకింగ్ చేస్తున్న పాక్ రాయబారి ఉబైదుర్ రెహ్మాన్ నిజామనీని లక్ష్యంగా చేసుకుని.. ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే, సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తం కావడంతో.. ఈ ఘటన నుంచి ఉబైదుర్ రెహ్మాన్ నిజామనీ సురక్షితంగా తప్పించుకున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. రాయబారిని కాపాడే ప్రయత్నంలో సెక్యూరిటీ గార్డ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రాయబారితోపాటు ఇతర అధికారులను పాకిస్థాన్ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు పాక్ రాయబారిని ఎందుకు టార్గెట్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది. ఆప్ఘపిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇటీవల కాలంలో ఆ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్పుల ఘటనలు సైతం అధికమయ్యాయి.
తమ రాయబారిపై జరిగిన హత్యాయత్నాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్టర్ లో కోరారు. రాయబారి ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ గార్డుకు సెల్యూట్ చెబుతూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉబైదుర్ రెహ్మాన్ నిజామనీ.. నవంబర్ 4వ తేదీన కాబుల్‌లో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ మంత్రి హీనా రబ్బానీ ఖర్ కాబుల్‌లో పర్యటించి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన కొద్దిరోజులకే ఈ దాడి జరగింది. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. కానీ, తన దౌత్య కార్యాలయాన్ని మాత్రం నిర్వహిస్తోంది.
I strongly condemn dastardly assassination attempt on ?? Head of Mission, Kabul. Salute to brave security guard, who took bullet to save his life. Prayers for the swift recovery of security guard. I
demand immediate investigation & action against perpetrators of this heinous act— Shehbaz Sharif (@CMShehbaz) December 2, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..