Pakisthan: రాత్రికి రాత్రే కరాచీలోని 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయం కూల్చివేత .. నిధుల కోసమే అంటూ అనుమానం..

|

Jul 17, 2023 | 2:44 PM

కరాచీలోని ముఖి చోహిత్రం రోడ్‌లో సోల్జర్ బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలో మారి మాత ఆలయం ఉంది. శ్రీ పంచముఖి హనుమాన్ మందిరంలోని పురాతన ఆలయం శ్రీ రామ్‌నాథ్ మిశ్రా మహారాజ ఆలయం. ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని.. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక నిధిని పాతిపెట్టారని తాము విన్నామని చెబుతున్నారు స్థానికులు..

Pakisthan: రాత్రికి రాత్రే కరాచీలోని 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయం కూల్చివేత .. నిధుల కోసమే అంటూ అనుమానం..
Hindu Temple Demolished
Follow us on

పాకిస్తాన్ లోని  కరాచీలోని 150 ఏళ్ల నాటి మారి మాతా హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో కరెంటు పోవడంతో బుల్‌డోజర్‌ నిలిచిపోయింది. సమీపంలోని ఆలయం కనిపించగానే ధ్వంసం చేశారు. అయితే ఆలయ బయటి గోడలు, గేటు మాత్రం మంచి స్థితిలో ఉన్నాయి. అయితే బుల్‌డోజర్‌ను నడుపుతున్న బృందానికి పోలీసులు ‘పాకెట్ మనీ’ ఇవ్వడం చూశామని స్థానిక ప్రజలు చెప్పారు. ఈ ఆలయ కూల్చివేత గురించి పాకిస్తాన్‌లోని ఆంగ్ల వార్తాపత్రిక డాన్ నివేదించింది.

కరాచీలోని ముఖి చోహిత్రం రోడ్‌లో సోల్జర్ బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలో మారి మాత ఆలయం ఉంది. శ్రీ పంచముఖి హనుమాన్ మందిరంలోని పురాతన ఆలయం శ్రీ రామ్‌నాథ్ మిశ్రా మహారాజ ఆలయం. ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని.. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక నిధిని పాతిపెట్టారని తాము విన్నామని చెబుతున్నారు స్థానికులు.. అంతేకాదు ఇప్పుడు ఆలయంపై దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు చాలా కాలంగాఆలయంపై నిఘా పెట్టారని వెల్లడించారు.

ఈ అతి పురాతన దేవాలయాన్ని మద్రాసీ హిందూ సమాజం ఏలుబడిలో ఉండేదని తెలుసోణ్డి. ఆలయ  భవనం చాలా పాతది కావడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో పాలకమండలి పట్టించుకోకపోయినప్పటికీ ఆలయాన్ని పునరుద్ధరించేంత వరకు తాత్కాలికంగా దేవుడి విగ్రహాన్ని వేరే చోట చిన్న గదిలోకి మార్చారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు’’ అని శ్రీ రామ్‌నాథ్ మిశ్రా మహారాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..