AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయం కింద తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

Mummified Sheep: దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన అబిడోస్ వద్ద అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం పరిశోధనలు జరుపుతోంది.

ఆలయం కింద తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
Mummified Sheep Heads
Balaraju Goud
|

Updated on: Mar 27, 2023 | 3:15 PM

Share

ఈజిప్ట్‌లోపురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లో కొత్త మమ్మీలను గుర్తించారు. ఈసారి గుర్తించింది మనుషులకు సంబంధించినవి కావు. జంతువులకు చెందినవి ఏకంగా రెండు వేలకు పైగా మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక ఆలయం కింద సుమారు రెండు వేలకు పైగా గొర్రె తలల మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్ట్‌ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్‌సెస్ II ఆలయంలో నైవేద్యంగా మమ్మీ చేసిన గొర్రెల తలలను మమ్మీ చేసి ఉంటారని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు.

దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన అబిడోస్ వద్ద అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం పరిశోధనలు జరుపుతోంది. వీరి తవ్వకాల్లో మమ్మీలుగా చేసిన కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు బయటపడినట్లు ఈజిఫ్టు ప్రభుత్వం వెల్లడించింది. అమెరికన్ మిషన్ అధిపతి సమేహ్ ఇస్కందర్ మాట్లాడుతూ.. రామ్‌సెస్ II మరణించిన 1,000 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఆరాధనను సూచిస్తూ గొర్రెల తలలు అర్పణలు చేసి ఉంటారని చెప్పారు. కైరోకు దక్షిణంగా నైలు నదిపై దాదాపు 435 కిలోమీటర్ల దూరం ఉన్న అబిడోస్, సెటి I పరిసరాలు మమ్మీ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది.

క్రీస్తు పూర్వం 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఈజిప్టును రామ్‌సెస్‌ II పాలించారు. ఆయన మరణాంతరం వెయ్యి ఏళ్ల తర్వాత జరిగిన ఆరాధన ఉత్సవాల్లో భాగంగా వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు వంటి జంతువులను బలి ఇచ్చి నైవేద్యం కోసం మమ్మీలుగా చేసి ఉంటారని సమేహ్ ఇస్కందర్ తెలిపారు. మమ్మీలుగా చేసిన జంతువుల అవశేషాలతోపాటు సుమారు 4,000 సంవత్సరాలు కిందట నిర్మించిన ఐదు మీటర్ల మందం అంటే 16 అడుగుల గోడలతో కూడిన ప్యాలెస్ శిథిలాలు, అనేక విగ్రహాలు, పాపిరి, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు వంటి వాటిని కూడా కనుగొన్నట్లు ఆయన చెప్పారు.

మరోవైపు 2374 నుంచి 2140 బీసీ మధ్య, 323 నుంచి 30 బీసీ నాటి టోలెమిక్ కాలం నాటి నిర్మాణాలు, రామ్‌సెస్ II ఆలయం, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకునేందుకు ఈ ఆవిష్కరణలు సహాయపడతాయని ఈజిప్ట్‌లోని పురాతన పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ అధిపతి మోస్తఫా వాజిరి తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..