H1B Visa Scam: అమెరికా డాలర్ డ్రీమ్ ఎంతో మంది సగటు భారతీయుల కల. మరీ ముఖ్యంగా తెలుగు వారికి అమెరికాకు విడదీయలేని అనుభందం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికాలో ఎమ్ఎస్ చేయడం నుంచి మొదలు హెచ్1బీ వీసా వరకు తెలుగు వారి పాత్ర ఎంతో ఉంది. ఈ క్రమంలోనే ఎలాగైనా హెచ్1బీ వీసా సాధించే క్రమంలో పలు రకాల మోసాలు పాల్పడిన ఘటను గతంలో వెలుగులోకి వచ్చాయి.
ఇక తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి మరో భారీ హెచ్1బీ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని టెక్సస్‌లో ఉన్న క్లౌడ్‌జెన్ అనే కంపెనీ థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి వచ్చే ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇప్పిస్తుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఆధారంగా చేసుకొని సదరు ఉద్యోగులకు హెచ్1బీ వీసాలు ఇస్తున్నారు. సాధారణంగా హెచ్1బీ విధానంలోఉద్యోగాలు పొందడం కాస్త కష్టం, సమయంతో కూడుకున్న పని కానీ.. క్లౌడ్‌జెన్ కంపెనీ కోరుకున్న కంపెనీకి హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేస్తోంది. ఇందు కోసం గాను ఈ కంఎనీ ఉద్యోగుల నుంచి కమిషన్ల రూపంలో ఉద్యోగుల నుంచి 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్లు వసూళ్లు చేపట్టింది. టెక్సస్‌లోని హూస్టన్ కోర్టులో క్లౌడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. రికార్డుల ప్రకారం క్లౌడ్‌జెన్ సంస్థకు ప్రెసిడెంట్‌గా శశి పల్లెంపాటి, వైస్ ప్రెసిడెంట్‌గా జోమోన్ చక్కలక్కళ్ పనిచేస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వర్జీనియాలోని మానస్సాస్, హైదరాబాద్ గచ్చిబౌలి, కెనడా, రొమేనియా దేశాల్లో క్లౌడ్‌జెన్‌కు కార్యాలయాలు ఉన్నారు. వీరు సాధారణంగా థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇప్పిస్తూ.. హెచ్1బీ వీసాలను జారీ చేపిస్తారు. అనంతరం అమెరికా వెళ్లిన తర్వాత ఉద్యోగులకు పని వెతికే ప్రయత్నం చేస్తారు. ఇలా కొనసాగుతోందీ ఘరనా మోసం .
Corona Effect: కరోనా దెబ్బతో తమ పదవులు వదులుకోవాల్సి వచ్చిన వివిధ దేశాల మంత్రులు..ఎందుకో తెలుసా?