Omicron: కొన్ని రోజుల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్… యూరోప్ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తుందని హెచ్చరిక..

|

Dec 08, 2021 | 7:24 PM

Omicron Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికా తమ దేశంలో వెలుగులోకి వచ్చిందని నవంబర్ 24వ తేదీన ప్రకటించింది. అయితే ఈ వేరియంట్ తమ దేశంలో..

Omicron: కొన్ని రోజుల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్... యూరోప్ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తుందని హెచ్చరిక..
Omicron Variant
Follow us on

Omicron Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికా తమ దేశంలో వెలుగులోకి వచ్చిందని నవంబర్ 24వ తేదీన ప్రకటించింది. అయితే ఈ వేరియంట్ తమ దేశంలో అంతకు కొన్ని రోజుల ముందే ఉందని మరో రెండు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ఎప్పుడు ఎక్కడ పుట్టింది అనే విషయంపై సరైన నిర్ధారణ లేకుండా.. కేవలం కొన్ని రోజుల్లో ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, అమెరికా వంటి ఖండాల్లో వ్యాపిస్తోంది. కొద్దీ రోజుల వ్యవధిలోనే సుమారు 57 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ జింబాబ్వే, మొజాంబిక్, నమీబియా,  స్వాజీలాండ్,  లెసోతో దక్షిణాఫ్రికా దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 24నుంచి డిసెంబర్ 5వరకూ 62,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపింది.

దీంతో రోజు రోజుకీ ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. డెల్టా వేరియంట్ కంటే.. ఎక్కువ వ్యాప్తి కలిగివుందని.. అయితే వ్యాధి తీవ్రత మాత్రం డెల్టా తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపింది. ఒమిక్రాన్‌ కారణంగా వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో.. రోగనిరోధక శక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియాల్సి ఉందని ప్రకటించింది.

ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఈ వేరియంట్ వేగంగా విజృభిస్తోందని .. రానున్న రోజులు శీతాకాలం కనుక బాధితుల సంఖ్య మరింతగా పెరిగి.. ఆస్పత్రిలో చేరే పేషేంట్స్ ఎక్కువగా ఉంటారని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అంతేకాదు కరోనా వ్యాధితో మరణించేవారికి సంఖ్య కూడా పెరుగుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు దేశాలను హెచ్చరించింది. ముఖ్యంగా  వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. రానున్న రోజుల్లో  ఒమిక్రాన్‌ వేరియంట్ పరిస్థితులను మరింత ఆందోళరకరంగా మారుస్తుందని తెలిపింది.   ఇప్పటి వరకూ ఐరోపా ఖండంలోని 19 దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిందని.. మొత్తంగా 274 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. అయితే రోగుల్లో వ్యాధి తీవ్రత.. లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని చెప్పింది.

వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పాక్షికంగా రక్షణ ఇస్తుందని దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది.

Also Read:  కొత్తజంటకు గిఫ్ట్‌ని అందంగా అలంకరించి మరీ తీసుకుని వెళ్లిన ఫ్రెండ్స్.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే నవ్వులు..