China: జీరో కొవిడ్ విధానంపై తీవ్రమవుతున్న ఆందోళనలు.. తగ్గేదేలే అంటున్న స్థానిక ప్రభుత్వం..

|

Oct 16, 2022 | 7:16 AM

కరోనా పుట్టిల్లు చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. రోజు రోజుకు పెరిగిపోతున్న కొవిడ్ కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కొవిడ్ జీరో విధానాన్ని అక్కడి అధికారులు కఠినంగా..

China: జీరో కొవిడ్ విధానంపై తీవ్రమవుతున్న ఆందోళనలు.. తగ్గేదేలే అంటున్న స్థానిక ప్రభుత్వం..
Corona Cases
Follow us on

కరోనా పుట్టిల్లు చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. రోజు రోజుకు పెరిగిపోతున్న కొవిడ్ కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కొవిడ్ జీరో విధానాన్ని అక్కడి అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొవిడ్ జీరో విధానంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో కేసులు వచ్చినా లక్షలాది మంది ఆంక్షల చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ విధానంపై విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఆ దేశంలో అధికారంలో ఉన్న ‘కమ్యూనిస్ట్ పార్టీ’ మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని సమర్థించింది. కరోనా వ్యాప్తి చెందుతోందనే విషయం వాస్తవమే అయినప్పటికీ.. మహమ్మారి కట్టడికి చైనా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని వెనకేసుకొచ్చింది.ఇది తక్కువ వ్యయంతో కూడుకున్నదని, సైన్స్ ఆధారంగా ఈ విధానం మంచిదేనని నిరూపితమైనదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అయినా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోన్న జీరో కొవిడ్‌ నిబంధనలను సడలించే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అవి బాగా పనిచేశాయి. మేం ప్రజారోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చైనా అధిక జనాభా కలిగిన దేశం. ప్రాంతాల మధ్య అభివృద్ధి అసమానంగా ఉంది. వైద్య వనరులు సరిపడా లేవు. ఈ క్రమంలో జీరో కొవిడ్ విధానం.. ఇన్‌ఫెక్షన్, మరణాల రేటును అత్యల్పంగా ఉంచడంలో తోడ్పడుతోంది. చైనా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని అవలంబిస్తున్నాం.

– సన్ యెలీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి

కమ్యూనిస్ట్‌ పార్టీ మహాసభల వేళ జీరో కొవిడ్‌ విధానాన్ని నిరసిస్తూ బీజింగ్‌, షాంఘై తదితర నగరాల్లో ప్రజా నిరసనలు వెల్లువెత్తాయి. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీరో కొవిడ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆంక్షలను సడలించాలని పలు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.