Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. పాక్ ప్రధాని, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారంటే..

|

Jun 03, 2023 | 4:18 PM

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్. జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ఘోర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. పాక్ ప్రధాని, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారంటే..
Odisha Accident
Follow us on

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్. జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ఘోర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు. అలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

 

ఇవి కూడా చదవండి


ప్రమాదం పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్ర్భాంతి

ఒడిశాలో రైలు ప్రమాద ఘటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తన తరఫున, తమ దేశ ప్రజల తరఫున రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

 


కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 300 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలంలో పట్టాలపై రైలు బోగీలు చెల్లచెదురుగా పడిపోవడంతో భయానక వాతావరణం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి