AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Titan: ‘టైటానిక్‌ షిప్‌’ పర్యటనకు మళ్లీ సిద్ధమైన ఓషన్ గేట్.. దరఖాస్తుల ఆహ్వానం..

అట్లాంటిక్‌ మహా సముద్రంలో సముద్ర ఉపరితలం నుంచి సుమారు 12,000 అడుగుల లోతులో అప్పటి టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్నాయి. అక్కడికి చేరుకొనేందుకు టైటాన్ మినీ సబ్ మెరైన్‌లో సుమారు 2-3 గంటల సమయం పాటు సముద్ర అడుగుకు ప్రయాణించవలసి ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేందుకు..

Titan: 'టైటానిక్‌ షిప్‌' పర్యటనకు మళ్లీ సిద్ధమైన ఓషన్ గేట్.. దరఖాస్తుల ఆహ్వానం..
Titan
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2023 | 5:59 PM

Share

111ఏళ్ల టైటానిక్‌ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్‌ విషాద యాత్రగా ముగిసింది. 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి.. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. సముద్రం అడుగున అప్పటి టైటానిక్ షిప్పు శిథిలాలను చూపించేందుకు గానూ అమెరికాలోని ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ సంస్థ టూరిజం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 18న బయల్దేరిన మినీ సబ్ మెరైన్‌ టైటాన్‌ సముద్రంలో పేలిపోయింది. టైటాన్‌లో వెళ్ళిన ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద ఆ మినీ సబ్ మెరైన్ శిధిలాలను, నౌకలో వెళ్లిన వారి శరీర అవశేషాలను వెలికి తీశారు. అయితే, ఈ విషాదం మరువక ముందే.. టైటానిక్ మాతృ సంస్థ అయిన ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ సంస్థ వెబ్‌సైట్‌లో వచ్చే ఏడాది టైటానిక్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదలచేసింది.

కంపెనీ వెబ్‌సైట్‌లో వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న రెండు పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయి. టైటానిక్ శిథిలాలను చూసేందుకు కంపెనీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు టూర్ ఆఫర్ చేస్తోంది.జూన్ 12 నుంచి 20 వరకు, 21 నుంచి 29 వరకు రెండు టూర్లు నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సాహస యాత్ర చేయాలనుకొనేవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. టైటాన్‌ సాహస యాత్రకోసం వచ్చే ఒక్కో పర్యాటకుడి నుంచి ఓషన్ గేట్ సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేస్తోంది. సుమారు 10,500 కేజీల బరువుండే టైటాన్ మినీ సబ్ మెరైన్‌లో కేవలం ముగ్గురు పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రయాణించగలరు. వారంలో ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనకు వెళ్లే వారు కనీసం 17 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలి. యాత్రలో వై-ఫై సౌకర్యాలు ఉంటాయని కంపెనీ వెబ్‌సైట్ కూడా చెబుతోంది.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో సముద్ర ఉపరితలం నుంచి సుమారు 12,000 అడుగుల లోతులో అప్పటి టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్నాయి. అక్కడికి చేరుకొనేందుకు టైటాన్ మినీ సబ్ మెరైన్‌లో సుమారు 2-3 గంటల సమయం పాటు సముద్ర అడుగుకు ప్రయాణించవలసి ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేందుకు అంత కంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుందని సమాచారం. అన్ని బాగుంటే టైటానిక్‌ షిప్‌ శిథిలాలను చూసి రావడం నిజంగా ఓ అద్బుతమనే చెప్పాలి. కానీ, తేడా వస్తే మాత్రం..రూ.2.5 కోట్లు పెట్టి చావుకు టికెట్‌ కొనుక్కొన్నట్లే అంటున్నారు పలువురు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..