దేశ రాజకీయాల్లో కీలకక పాత్ర పోషించేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్.. ఖండాతరాల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. లండన్ లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధణైంది. ఈ మేరకు త్వరలోనే ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నట్లు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి వెల్లడించారు. ఇటీవల అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు , నాయకులకు, కార్యకర్తలకు అశోక్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మొట్టమొదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్ లో ఎగురువేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం వారి వెంట నడిచామని, ఇప్పుడు కూడా అదే స్పూర్తితో దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు.
నేడు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యం. ఇదే విషయాన్ని ఎన్నారైలందరూ విశ్వసిస్తున్నారు. మేమంతా కేసీఆర్ ఎంటే ఉన్నాం. యూకే లో నివాసముంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా బీఆర్ఎస్ లో చేరి, కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తాం.
– అశోక్ గౌడ్ దూసరి
“దేశ్ కీ నేత కేసీఆర్”, “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది. కేసీఆర్ ఇచ్చే ప్రతీ పిలుపుకు స్పందిస్తామని, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. మైళ్ల దూరంలో ఉన్నా నాడు టీఆర్ఎస్ ఉద్యమ జెండా, నేడు దేశ గతిని మార్చే మరో ఉద్యమ బీఆర్ఎస్ జెండా మోసే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు కేసీఆర్ కు, కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
– అశోక్ దూసరి, లండన్
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి