North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

రాజు స్థానంలో యువరాజు.. వారసుడు లేకుంటే కూతురే యువరాణి. అలనాటి రాజుల చరిత్ర ఇప్పటికీ వుందా?! ఓ చిన్నారి మహారాణి నార్త్‌ కొరియాను శాసించే వేళాయిందనే ప్రచారం జోరందుకుంది. కానీ ఈ మ్యాటర్‌పై కిమ్‌ కిమ్మనడంలేదు. కానీ సౌత్‌ కొరియాలో మాత్రం నార్త్‌ కొరియా చిన్నారి మహారాణి ముచ్చటే హాట్‌ టాపిక్‌గా మారింది.

North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?
Kim Jong Un's Daughter Kim Ju Ae Firing A New Sniper Rifle

Updated on: Feb 28, 2026 | 12:30 PM

నార్త్‌ కొరియా సుప్రీం ఏం చేసినా ఓ సంచలనమే. తన కూతురికి నార్త్‌ కొరియా పగ్గాలు అందించబోతున్నాన్నడనే చర్చ ఇప్పుడు సన్సేషన్‌గా మారింది. కిమ్‌.. తన 13 ఏళ్ల కూతురు కిమ్‌ -జు-యే తన వారసురాలిగా ఖరారు చేశారన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. అధికారిక, సైనిక సహా పలు ముఖ్య కార్యక్రమాల్లో కిమ్‌తో పాటు ఆయన కూతురు పాల్గొంటున్నారు. దాంతో ఆమెకు త్వరలోనే పట్టాభిషేకం చేస్తారనే టాక్‌ పీక్స్‌కు వెళ్లింది. మరి తండ్రి బాటలో కిమ్‌ జూ-యేకు నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారైందనే ప్రచారం జోరందుకుంది.

కొద్దిరోజులుగా ఉత్తర కొరియాలో కిమ్ వారసత్వంపై జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల అధికారిక కార్యక్రమాలకు కిమ్ తన వెంట ఆయన కూతురును కూడా తీసుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన వారసురాలిగా తీర్చిదిద్దేందుకు జూ యే కు కిమ్ శిక్షణనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. లేటెస్ట్‌గా ప్రొఫెషనల్ షూటర్ లాగా జూ యే రైఫిల్ పట్టుకుని గురిచూస్తున్నట్లు ఓ ఫొటో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఉత్తర కొరియా తదుపరి బాస్ ఈమేనా అనే సందేహాలు జోరు అందుకున్నాయి..!

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ రాజధానిలో సైనిక కవాతును వీక్షించారు. కవాతు సందర్భంగా, దేశ సైనిక సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని, ముఖ్యంగా దాని అణ్వాయుధ కార్యక్రమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. తన భద్రతకు ముప్పు వాటిల్లితే దక్షిణ కొరియాను పూర్తిగా నాశనం చేస్తానని కిమ్ జోంగ్ ఉన్ బెదిరించాడు. అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచి ఉంచినట్లు కూడా ఆయన ప్రకటించారు. కవాతు సందర్భంగా కిమ్ కుమార్తె జు యే ఆయనతో పాటు వెళ్లారు.

ఈ సందర్భంగా సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈక్రమంలో ఒక అవుట్‌డోర్ షూటింగ్ రేంజ్‌లో, జూ యే స్కోప్‌తో గురి చూస్తూ తుపాకీని పేలుస్తున్న ఫొటోలు బయటికొచ్చాయి.. అంతేకాక తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ కూడా ధరించారు. ఇది ఆ దేశంలో అధికారం, వారసత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. దీంతో కిమ్ తర్వాత పాలనా బాధ్యతలను ఆయన కూతురు చేపడతారని ప్రచారం జరుగుతోంది.

Kim Jong Un, Kim Ju Ae,

ఇదిలావుంటే, బుధవారం (ఫిబ్రవరి 25) రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ గుండా 14,000 మంది సైనికులు కవాతు చేశారని ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా పేర్కొంది. ఫైటర్ జెట్‌లు తలపైకి గర్జిస్తూ, ఫ్లడ్ లైట్ల వెలుగులో సైనికులు కవాతు చేశారు. కవాతులో ట్యాంకులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBM) సహా ఇతర ఆయుధాలు లేవు. కవాతులో కిమ్ పాలన సాధారణంగా కవాతుల్లో దాని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రమంలోనే 13ఏళ్ల కిమ్ టీనేజ్ కుమార్తె జు యే, తన తండ్రితో కలిసి కవాతులో ప్రముఖంగా కనిపించింది. కిమ్ ఆమెను తన వారసురాలిగా పేర్కొంటారని భావిస్తున్నారు. దక్షిణ కొరియా జు యే వారసుడి గురించి పదేపదే ఊహాగానాలు చేస్తోంది. అయితే, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పాలక పార్టీ కాంగ్రెస్ ముగింపులో కిమ్ తన వారసురాలిగా కూతురిని ప్రకటిస్తారని భావించారు. కానీ ఆమోద ముద్ర వేయలేదు

ఇదిలావుంటే, కిమ్‌కు ముగ్గురు సంతానం. వారిలో రెండో కుమార్తెనే 13 ఏళ్ల కిమ్‌ జు యే. ఉత్తర కొరియాలో ఎప్పటి నుంచో కుటుంబ పాలన ఉంది. కిమ్‌ కూడా వారసత్వంగానే పగ్గాలు చేపట్టారు. 13 ఏళ్లకే రాజ్యాధికారం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలకు తావులేదు. కిమ్‌ తలచుకుంటే అయిపోవాల్సిందంతే. వర్కర్స్ పార్టీ నిబంధనల ప్రకారం మెంబర్‌ కావాలంటే కనీసం 18 ఏళ్లు నిండాలి. అందుకే డైరెక్ట్‌గా సుప్రీం పోస్ట్‌ కాకుండా , పార్టీ సెంట్రల్ కమిటీకి ఆమెను సెక్రటరీగా అపాయింట్‌ చేస్తారని.. ఆతరువాత పూర్తిస్థాయిలో వారసత్వ పగ్గాలు అప్పగించేలా కిమ్‌ పకడ్బందీ ప్లాన్‌ చేశాడనే చర్చ జరుగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us