US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పలువురు మృతి.. పరారీలో నిందితుడు..
ఒక రెస్టారెంట్ సమీపంలో ఒక దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల భయంతో అక్కడి ప్రజలంతా నలువైపుల పారిపోయారు. కాల్పుల అనంతరం దుండగుడు పడవలో పారిపోయాడు. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఒక్కసారిగా జరిగిన కాల్పుల శబ్ధాలతో భయాందోళనలు చెలరేగాయి. రెస్టారెంట్ సమీపంలో ఒక దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల భయంతో అక్కడి ప్రజలంతా నలువైపుల పారిపోయారు. కాల్పుల అనంతరం దుండగుడు పడవలో పారిపోయాడు. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఈ సంఘటన విల్మింగ్టన్‌కు దక్షిణంగా దాదాపు 20 మైళ్ల దూరంలో ఉన్న సౌత్‌పోర్ట్ యాచ్ బేసిన్ ప్రాంతంలోని 150 యాచ్ బేసిన్ డ్రైవ్‌లో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ అనే పబ్, రెస్టారెంట్‌లో రాత్రి 9:30 గంటలకు (స్థానిక సమయం) జరిగింది.
వీడియో ఇక్కడ చూడండి..
#BREAKING: At least ‘3 confirmed dead’ after shooting in Southport, North Carolina per The Blaze https://t.co/JHAtujtmkR pic.twitter.com/YtIsVSc0qn
— Rapid Report (@RapidReport2025) September 28, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కనీసం ఏడుగురు వ్యక్తులపై కాల్పులు జరిపారు. వారిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. మిగిలిన బాధితులను ఏరియా ఆసుపత్రులకు తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




