Nobel Prize: స‌హ‌జ ప‌రిశోధ‌న‌లకు నోబెల్ ఫ్రైజ్.. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి సంయుక్తంగా బహుమతి

Nobel Prize: ప్రపంచ అత్యుత్తమ పురస్కారం నోబెల్ ఫ్రైజ్ ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని వ‌రించింది. స‌హ‌జ ప‌రిశోధ‌న‌ల ద్వారా సంచలన విషయాలను వెల్లడించినందుకు గానూ వీరికి గౌరవం దక్కింది.

Nobel Prize: స‌హ‌జ ప‌రిశోధ‌న‌లకు నోబెల్ ఫ్రైజ్.. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి సంయుక్తంగా బహుమతి
Nobel Prize
Follow us

|

Updated on: Oct 11, 2021 | 5:26 PM

Nobel Prize in Economics 2021: ప్రపంచ అత్యుత్తమ పురస్కారం నోబెల్ ఫ్రైజ్ ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని వ‌రించింది. స‌హ‌జ ప‌రిశోధ‌న‌ల ద్వారా సంచలన విషయాలను వెల్లడించినందుకు గానూ వీరికి గౌరవం దక్కింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్‌, జాషువా డీ. ఆంగ్రిస్ట్‌, గైడో డ‌బ్ల్యూ ఇంబెన్స్‌లు.. ఎక‌నామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్ కార్డ్‌కు పుర‌స్కారం అర్థ భాగం ద‌క్కగా.. మ‌రో ఇద్దరు స‌గం ప్రైజ్‌మ‌నీ పంచుకోనున్నారు. లేబ‌ర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలకు గానూ వీరికి గుర్తింపు దక్కింది. వారి అధ్యయనంలో అనేక కొత్త అంశాల‌ను వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా ప‌రిశోధ‌న‌ల్లో విప్లవాత్మక మార్పులు వ‌చ్చిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొంది.

అమెరికాలోని బెర్క్‌లే లో ఉన్న కాలిఫోర్నియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డేవిడ్ కార్డ్‌కు ఫ్రైజ్‌లో సగం ద‌క్కనుంది. కార్మిక ఆర్థిక వ్యవ‌స్థ గురించి కార్డ్ కొన్ని కీలక సూచ‌న‌లు చేశారు. అమెరికాలోని మ‌సాచుసెట్స్ టెక్నాల‌జీ ఇన్స్‌టిట్యూట్ ప్రొఫెస‌ర్ జాషువా డీ, స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గైడో ఇంబెన్స్‌లు.. క్యాజువ‌ల్ రిలేష‌న్‌షిప్స్‌ను విశ్లేషించారు.

స‌హ‌జ ప‌రిశోధ‌న‌ల ద్వారా ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు సంచ‌ల‌నాత్మక అంశాల‌ను వెల్లడించారు. సామాజిక శాస్త్రంలో చాలా వ‌ర‌కు అంశాల్లో.. కార‌ణం ఏంటి, దాని ప్రభావం ఏంట‌న్న రీతిలోనే ఉంటాయి. అయితే, అలాంటి విష‌యాల‌పై ఈ ముగ్గురూ కొత్త విధానాన్ని ప్రవేశ‌పెట్టారు. ఇమ్మిగ్రేష‌న్ వ‌ల్ల జీతంపై ప్రభావం ఉంటుందా.. ఉద్యోగంలో మార్పు ఎలా ఉంటుంద‌న్న లాంటి అంశాల‌పై వీరు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. పెద్ద చ‌దువులు చ‌దవ‌డం వ‌ల్ల భ‌విష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుంది. నిజానికి ఇలాంటి ప్రశ్నల‌కు స‌మాధానాలు వెత‌క‌డం ఈజీ కాదు. అయితే, ఇలాంటి ప్రశ్నల‌కు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు స‌హ‌జ‌మైన రీతిలో స‌మాధానం ఇచ్చే ప్రయ‌త్నం చేశారు. వీటిపై పూర్తి విశ్లేషణలను పరిగణంలోకి తీసుకున్న నోబెల్ కమిటీ ముగ్గురి సంయుక్తంగా ఆర్థశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేసింది.

Read Also… D-Mart Market Cap: డీ మార్ట్ సంచలనం.. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 3 ట్రిలియన్‌ల రికార్డు.. భారీగా పెరిగిన షేర్ ధర!

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే