Srilanka: పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయ్.. బంకుల వద్ద బారులు తీరొద్దు.. ఆంక్షలతో అతలాకుతలం

|

May 19, 2022 | 6:35 AM

శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న సంక్షోభంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలు లేక స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రవాణాలో కీలక పాత్ర పోషించే ఇంధనం నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్(Petrol) దిగుమతి....

Srilanka: పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయ్.. బంకుల వద్ద బారులు తీరొద్దు.. ఆంక్షలతో అతలాకుతలం
Sri Lanka
Follow us on

శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న సంక్షోభంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలు లేక స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రవాణాలో కీలక పాత్ర పోషించే ఇంధనం నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్(Petrol) దిగుమతి చేసుకునేందుకు విదేశీ కరెన్సీ లేదని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా ప్రజలెవరూ పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరొద్దని సూచించింది పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నా డీజిల్‌ నిల్వలు మాత్రం సరిపడా ఉన్నాయని తెలిపింది. శ్రీలంక తీరంలో పెట్రోల్‌ నౌకలు నిలిచి ఉన్నాయని, వాటికి చెల్లింపులు చేసి ఇంధనాన్ని దించుకునేందుకు అమెరికా(America) డాలర్లు లేవని ప్రభుత్వం చెబుతోంది. అంతకుముందు పంపించిన సరకు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని వివరించింది. మరోవైపు.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. దేశానికి 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారం అందించినట్లు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బుధవారం వెల్లడించారు. మరో రెండు రోజుల్లో సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ శ్రీలంక.. దీనికి పరిష్కారం లభించే దిశగా కృషిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, సామాన్యుడికి అందనంత ఎత్తుకెళ్లిపోయాయి. ఫలితంగా సామాన్యుడి జీవనం అగమ్యగోచరంగా మారింది. స్వదేశంలో జీవించడమే కష్టంగా మారడంతో అనేక కుటుంబాలు పొట్టచేతపట్టుకుని భారత్‌కు వలస వస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం కావాలని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఏడాది మార్చి నాటికి లంక విదేశీ మారక నిల్వలు 1.93 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు

Telangana: మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం