China: ఆ విమానాన్ని పైలట్లే కూల్చేశారా?.. బ్లాక్ బాక్స్ డేటాలో సంచలన విషయాలు

మార్చిలో చైనా(China) లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పైలట్లే ఈ విమానాన్ని కూల్చేసి ఉండొచ్చిని విశ్లేషణలు చెబుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే...

China: ఆ విమానాన్ని పైలట్లే కూల్చేశారా?.. బ్లాక్ బాక్స్ డేటాలో సంచలన విషయాలు
China
Follow us

|

Updated on: May 18, 2022 | 9:00 PM

మార్చిలో చైనా(China) లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పైలట్లే ఈ విమానాన్ని కూల్చేసి ఉండొచ్చిని విశ్లేషణలు చెబుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లభించిన బ్లాక్‌బాక్స్‌ డేటాను విశ్లేషించగా ఈ విషయం తెలిసినట్లు ఓ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు(China Eastern Airlines) చెందిన బోయింగ్‌ 737 విమానం ఈ ఏడాది మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది మృత్యువాతపడ్డారు. విమానంలో ఉన్నవారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. కున్మింగ్‌ నగరం నుంచి బయల్దేరిన తర్వాత గగనతలంలో 9వేల అడుగుల ఎత్తులో కౌంటీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనపై చైనా దర్యాప్తు చేపట్టింది. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో లభించిన బ్లాక్‌బాక్స్‌లను విశ్లేషించారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ప్రమాదం జరిగిన విమానానికి సమీపంలో వెళ్తున్న విమానాల పైలట్లు కూడా సమాచారం ఇచ్చేందుకు పదేపదే కాల్స్‌ చేశారు. కానీ, ఆ పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే ఉద్దేశపూర్వకంగా విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని బ్లాక్‌బాక్స్‌ డేటా ప్రకారం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై బోయింగ్‌ నుంచి గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.