AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: రష్యాకు చైనా షాక్.. ఆ పరికరాల ఎగుమతి భారీగా నిలిపివేత

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం(Russia -Ukraine War) కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఎగుమతుల నిలిపివేతతో రష్యా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇన్నాళ్లు రష్యాకు అనుకూలంగా ఉన్న చైనా(China) కూడా ...

Russia: రష్యాకు చైనా షాక్.. ఆ పరికరాల ఎగుమతి భారీగా నిలిపివేత
Russia China
Ganesh Mudavath
|

Updated on: May 18, 2022 | 8:23 PM

Share

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం(Russia -Ukraine War) కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఎగుమతుల నిలిపివేతతో రష్యా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇన్నాళ్లు రష్యాకు అనుకూలంగా ఉన్న చైనా(China) కూడా ప్రస్తుతం మొండిచేయి చూపడంతో ఆ దేశం అవస్థ పడుతోంది. చైనా సాయంతో కష్టాల నుంచి బయటపడవచ్చని భావించిన రష్యాకు చైనా తీసుకున్న నిర్ణయం మింగుడుపడని విధంగా మారింది. ఇప్పటికే అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఆ దేశాల తీరుతో రష్యాకు సహాయం అందించేందుకు చైనా కూడా వెనుకడుగు వేస్తోంది. కొన్నాళ్లుగా చైనా నుంచి రష్యాకు వెళుతున్న సాంకేతికపరమైన ఉత్పత్తుల పరిమాణంలో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది. ఈ విషయాన్ని అమెరికా కామర్స్‌ సెక్రటరీ జినా రైమాండో వెల్లడించారు. చైనా నుంచి రష్యాకు ఎగుమతి అవుతున్న ల్యాప్‌టాప్‌ల సంఖ్యలో ఫిబ్రవరితో పోలిస్తే 40 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మూడింట రెండొంతులు, టెలికమ్యూనికేషన్స్‌ పరికరాల ఎగుమతులు 98 శాతం తగ్గాయని వెల్లడించారు.

ఆంక్షలతో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా సహా 37 దేశాలు కలిసిపోయాయి. అమెరికా ఆంక్షల పరిధిలో కంప్యూటర్‌ చిప్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ పరికరాలు, లేజర్లు, ఏవియానిక్స్‌, మారిటైమ్‌ టెక్నాలజీకి చెందిన పరికరాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తే చోటు చేసుకొనే పరిణామాలకు భయపడి చైనా కూడా వెనక్కి తగ్గింది.

మరోవైపు.. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరితే తమకెలాంటి సమస్యలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఇప్పటికే క్లిష్టంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేయడానికి అమెరికా నాటో విస్తరణను దూకుడుగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. రష్యాతో 1,300 కిలోమీటర్లకుపైగా సరిహద్దు పంచుకొంటున్న ఫిన్లాండ్‌ నాటోలో చేరతామని తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Davos Summit:పెట్టుబడులు తీసుకురావడమే టార్గెట్.. దావోస్ సమిట్‌కు ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్