ఆ ఒక్కడు అడ్డుకొని పలువురు ప్రాణాలు కాపాడాడు

న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49మంది ప్రాణాలు కోల్పోగా, వందల్లో గాయపడ్డారు. ఈ మారణహోమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించాయి. దాడిపై ప్రత్యక్ష సాక్షి సయ్యద్ మొజారుద్దీన్ వివరించారు. కాల్పులు జరుపుతున్న దుండగుడిని తన స్నేహితుడిని ఆపకపోతే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని ఆయన తెలిపారు. ‘‘అందరూ ప్రార్థనలో ఉండగా నలుపు రంగు దుస్తులు ధరించిన ఓవ్యక్తి మసీదు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న వృద్ధులపై కాల్పులు జరిపాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో […]

ఆ ఒక్కడు అడ్డుకొని పలువురు ప్రాణాలు కాపాడాడు
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 9:12 AM

న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49మంది ప్రాణాలు కోల్పోగా, వందల్లో గాయపడ్డారు. ఈ మారణహోమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించాయి.

దాడిపై ప్రత్యక్ష సాక్షి సయ్యద్ మొజారుద్దీన్ వివరించారు. కాల్పులు జరుపుతున్న దుండగుడిని తన స్నేహితుడిని ఆపకపోతే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని ఆయన తెలిపారు. ‘‘అందరూ ప్రార్థనలో ఉండగా నలుపు రంగు దుస్తులు ధరించిన ఓవ్యక్తి మసీదు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న వృద్ధులపై కాల్పులు జరిపాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో మసీదులో ఉన్న వారు ఉలిక్కిపడి భయంతో పరుగులు తీశారు. వారిపై ఆ ఆగంతుకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో మసీదులో 60-70మంది మాత్రమే ఉన్నారు. దుండగుడు దాడి చేస్తున్న సమయంలో నా స్నేహితుడు అతడిని అడ్డుకున్నాడు. అతని చేతుల్లో ఉన్న రెండు ఆయుధాలను లాక్కున్నాడు. ఈ క్రమంలో నా స్నేహితుడు తీవ్రంగా గాయ పడ్డాడు. ఆయుధాలు లాక్కున్న వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. నా స్నేహితుడు అడ్డుకోకుండా ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆ తరువాత కాసేపటికే మరణించాడు. రెండు రోజుల క్రితమే అతడికి వివాహమైంది’’ అంటూ సయ్యద్ చెప్పుకొచ్చాడు.