చివరికి ఆ యువతికి క్షమాపణలు చెప్పిన థామస్ కుక్ ఎయిర్ వేస్
ఎమిలీ ఓకన్నర్ అనే 21 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సందర్భంగా థామస్ కుక్ ఎయిర్ లైన్స్ విమానంలో టికెట్లు బుక్ చేసుకుంది. విమానాశ్రయంలో చెక్-ఇన్ తర్వాత విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. థామస్ కుక్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. లో దుస్తులను తలపిస్తున్న ఆమె టాప్‌ను వెంటనే మార్చుకోవాలని, లేదా కప్పుకోవాలని సిబ్బంది ఆమెను కోరారు. దీంతో […]
ఎమిలీ ఓకన్నర్ అనే 21 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సందర్భంగా థామస్ కుక్ ఎయిర్ లైన్స్ విమానంలో టికెట్లు బుక్ చేసుకుంది.
విమానాశ్రయంలో చెక్-ఇన్ తర్వాత విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. థామస్ కుక్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. లో దుస్తులను తలపిస్తున్న ఆమె టాప్‌ను వెంటనే మార్చుకోవాలని, లేదా కప్పుకోవాలని సిబ్బంది ఆమెను కోరారు.
దీంతో ఎమిలీ ఆశ్చర్యపోయింది. విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ప్రయాణికులు వేసుకునే డ్రస్ మీద అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మీకు లేదని, విమానంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్పకుండా తాను డ్రస్ మార్చుకుంటానని తెలిపింది. అయితే, విమానంలో ఎవరూ ఆమె డ్రస్‌పై ఫిర్యాదు చేయలేదు.కానీ, సిబ్బంది మాత్రం ఆమె డ్రస్ మార్చుకోవల్సిందే అంటూ మొండిపట్టు పట్టారు. లేకపోతే ఆమె లగేజ్‌ను విమానం నుంచి కిందికి దించేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమిలీ సోదరి తన వద్ద ఉన్న జాకెట్‌ను కప్పడంతో సిబ్బంది విమానంలో ప్రయాణించేందుకు అనుమతించారు.
ఈ చేదు అనుభవాన్ని ఎమిలీ ట్వీట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ఇది తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత అవమానకరమైన ఘటన అని తెలిపింది.
Flying from Bham to Tenerife, Thomas Cook told me that they were going to remove me from the flight if I didn’t “cover up” as I was “causing offence” and was “inappropriate”. They had 4 flight staff around me to get my luggage to take me off the plane. pic.twitter.com/r28nvSYaoY
— Emily O’Connor (@emroseoconnor) March 12, 2019
To top it off they allowed a man hurl abuse at me whilst the Flight manager and 4 air staff stood and said nothing.
— Emily O’Connor (@emroseoconnor) March 12, 2019
just a quick message to say thank you to everyone that has stuck up for me. I’ve been inundated with love and support off all genders and it truly means a lot ?
— Emily O’Connor (@emroseoconnor) March 14, 2019
I was given a jacket by my cousin sitting at the front of the plane and they did not leave until I physically put it on. They made comments over the speaker about the situation and left me shaking and upset on my own.
— Emily O’Connor (@emroseoconnor) March 12, 2019
ఆమె ట్వీట్ చూసిన నెటిజనులు థామస్ కుక్ విమానయాన సంస్థపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన థామస్ కుక్ ఎయిర్ వేస్. ఎమిలిని ఇబ్బంది పెట్టినందుకు చింతిస్తున్నాం అని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని థామస్ కుక్ ఎయిర్ వేస్ సంజాయిషీ చెప్పుకుంది.