Viral News: పిల్లులతో లొల్లి.. క్యాట్స్‌పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే!

స్వదేశీ వన్యప్రాణులను రక్షించుకోవడానికి న్యూజిల్యాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2050 నాటికి దేశంలోని అడవి పిల్లులను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అడవి పిల్లులపై యుద్దం ప్రకటించింది. అడవి పిల్లులు జీవవైవిధ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 మిలియన్ల అడవి పిల్లులు తమ జీవితాలను కోల్పతాయని తెలుస్తోంది.

Viral News: పిల్లులతో లొల్లి.. క్యాట్స్‌పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే!
Cats Eradication

Updated on: Nov 28, 2025 | 1:54 PM

న్యూజిలాండ్‌ దేశంలో చాలా ప్రాంతాలలో అడవి పిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాటి మనుగడకోసం పక్షులు, గబ్బిలాలు, బల్లులు వంటి కీటకాలను వేటాడతాయి. ఇది దేశంలో జీవవైవిధ్యానికి పెను ముప్పుగా మారింది. దీంతో తమ దేశంలోని ప్రత్యేకమైన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి 2016లో ప్రభుత్వం “ప్రెడేటర్ ఫ్రీ 2050” (Predator Free 2050) అనే ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రారం 2050 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అడవి పిల్లులు (ఇన్వాసివ్ ప్రెడేటర్లు) లను అంతం చేయాలని నిర్ణయించింది.

అయితే ఇక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదేమి మొదటి సారి కాదట.. గతంలో ఇలాంటి పరిస్థితులే ఎదురైతే ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఇలాంటి జంతువులను పెద్ద ఎత్తున అంతం చేసింది ప్రభుత్వం. దేశంలోని వ్యవసయ పంటలకు భారీ నష్టం కలిగిస్తున్నాయని 2021లో, పదివేల నెమళ్లను న్యూజిలాండ్ ప్రభుత్వం చంపినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే జింకల పెరుగుదల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుందిని వాటిని కూడా ప్రభుత్వం అంతమొందించినట్టు తెలుస్తోంది.

ఎలా అమలు చేస్తున్నారు?

ప్రభుత్వం వీటిని అంతం చేసేందుకు అనేక ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ట్రాప్స్, పాయిజన్ బైట్స్, ఎరియల్ టాక్సిన్స్. జెనెటిక్ టూల్స్ (జీన్ డ్రైవ్స్), ఇన్నోవేటివ్ టెక్నాలజీలు ఉపయోగిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (DOC) నేతృత్వంలో ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుంది. ఇవ్వాల్స్ (మావోరి ట్రైబ్స్), NGOs, వంటి 2,000లకు పైగా కమ్యూనిటీ గ్రూపులు ఇందులో పాల్గొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us