కరోనా వైరస్ తగ్గుతుందని సంతోష పడాలో.. లేదా.. ఆ మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో దెబ్బతింటున్న మానసిక ఆరోగ్యంపై బాధపడాలో తెలియని పరిస్థిలో ప్రపంచం నిలిచిందంటే ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తార్కాణంగా తాజాగా విడుదలైన ఓ సర్వే ఫలితాలు చూస్తే మాత్రం, ప్రపంచం ఉలిక్కి పడాల్సిందే. కరోనా వైరస్‌తో సంబంధం ఉన్న రిస్క్‌లలో కూడా మార్పు వచ్చినట్లు ఇందులో తేలింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో, సైకోసిస్, డిమెన్షియా, మెదడు పొగమంచు మొదలైనవాటితో సహా కరోనా సోకిన రోగులలో న్యూరోలాజికల్, సైకియాట్రిక్ సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. 1.2 మిలియన్లకు పైగా కరోనా రోగుల మెడికల్ డాక్యుమెంటేషన్ ఫలితాలు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో పోలిస్తే, ఇన్ఫెక్షన్ తర్వాత రోగులకు నరాల, మానసిక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ సర్వేలో తెలింది.
ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం మేరకు పెద్దవారిలో నిరాశ, ఆందోళనలు గణనీయంగా పెరిగాయి. కనీసం రెండు నెలల పాటు రోగులలో కనిపించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం, కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రాణాలతో బయటపడినవారికి నాడీ, మానసిక పరిస్థితుల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని ఆధారాలు పెరుగుతున్నాయి.
UKలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హారిసన్ పాల్, చాలా మంది రోగులలో నాడీ సంబంధిత, మానసిక ప్రమాదాలు కనీసం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతాయని తెలిపారు. అంటువ్యాధి తగ్గిన తర్వాత చాలా కాలం పాటు కరోనా ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం ఉన్న న్యూరోలాజికల్ పరిస్థితుల కొత్త కేసులు సంభవిస్తాయని కూడా పేర్కొన్నారు. అధ్యయనం సమయంలో మొత్తం 12,84,437 మంది రోగుల ఫలితాలపై ప్రయోగాలు చేసినట్లు తెలిపారు. ఇందులో 18, 64 సంవత్సరాల మధ్య 185,748 మంది పిల్లలు, 856,588 మంది పెద్దలు ఉన్నారు.
గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు టీకాలుకూడా కోవిన్‌కు అనుసంధానం..
వచ్చే నెల సెప్టెంబర్ రెండో వారంలో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు టీకాలు వేయడం త్వరలోనే కోవిన్‌కు అనుసంధానించనున్నారు. ఆ తర్వాత యూనివర్సల్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం కోవిన్ వెబ్‌సైట్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సమయంలో, రక్తదానం, అవయవ దానంకు సంబంధించిన అవగాహన ప్రచారాల గురించి సమాచారం కూడా వెబ్‌సైట్ నుంచి అందుబాటులో ఉంటుంది.