Imran Khan: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. అవిశ్వాస తీర్మానం దిశగా ప్రతిపక్షాలు..

|

Mar 05, 2022 | 9:09 AM

Pakistan PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో చూశాం. వాటికి అనేక కారణాలు ఉన్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు గ‌డ్డుకాలం

Imran Khan: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. అవిశ్వాస తీర్మానం దిశగా ప్రతిపక్షాలు..
Imran Khan
Follow us on

Pakistan PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో చూశాం. వాటికి అనేక కారణాలు ఉన్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు గ‌డ్డుకాలం ప్రారంభ‌మైందని అంటున్నారు విశ్లేశకులు. ఆయ‌న‌కు పాక్ ప్రతిప‌క్షాలన్నీ క‌లిసి తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశాయి. ఐదు రోజుల్లోగా రాజీనామా అయినా చేయాలని, లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోడానికి రెడీ అవ్వాలనీ ఆప్షన్లు ఇచ్చాయి. అటు దేశంలో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావ‌ల్ భుట్టో. ప్రధాని ఇమ్రాన్ ముందు రెండే రెండు మార్గాలున్నాయ‌ని, ప్రధాని ప‌ద‌వికి రాజీనామా అయినా చేయాలని, లేదంటే అవిశ్వాసాన్నైనా ఎదుర్కోవాలంటూ స‌వాల్ విసిరారు భుట్టో. అవిశ్వాసాన్ని ప్రవేశ‌పెట్టే విష‌యంలో ప్రతిపక్షాలన్నీ ఏక‌తాటిపైనే ఉన్నాయ‌న్నారాయన. దేశంలో ద్రవ్యోల్బణం విప‌రీతంగా పెరిగిపోతోంద‌ని, ధ‌ర‌లు పెరిగాయ‌ని, దీనిపై తాము పోరాడ‌తామ‌ని ప్రక‌టించారు బిలావ‌ల్ భుట్టో. అటు ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టాల‌నే దిశ‌గా క‌దులుతున్నాయి.

పాక్ నేష‌నల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లున్నాయి. స‌ర్కార్‌ను ఏర్పాటు చేయాలంటే 177 సీట్లు కావాలి. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర 156 సీట్లున్నాయి. అవి మ‌ద్దతిచ్చే పార్టీల‌ను క‌లుపుకొనే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ పార్టీలు త‌మ మ‌ద్దతును ఉప‌సంహ‌రించుకుంటున్నట్లు ప్రక‌టిస్తే, ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలిన‌ట్టే. మామూలుగా అయితే, పాక్‌లో 2023లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి వుంది. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటే కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. గ‌తంలోనే ప్రభుత్వ ఏర్పాటులో దాదాపుగా 20 సీట్లు త‌క్కువ‌య్యాయి. అతి క‌ష్టం మీద ఇత‌రుల మ‌ద్దతుతో ఇమ్రాన్ మిత్రప‌క్షాల మ‌ద్దతు కూడ‌గ‌ట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read:

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..