Modi in Bangladesh : ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్లో మోదీ, భారత్ – బంగ్లా ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని పిలుపు

|

Mar 26, 2021 | 9:53 PM

Narendra Modi in Bangladesh : ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారత్ - బంగ్లాదేశ్ రెండూ ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ..

Modi in Bangladesh : ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్లో మోదీ,  భారత్ - బంగ్లా ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని పిలుపు
Modi 2
Follow us on

Narendra Modi in Bangladesh : ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారత్ – బంగ్లాదేశ్ రెండూ ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఢాకాలో జరిగిన బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బంగ్లా-భారత్‌ మధ్య విడదీయలేని సంబంధం ఉందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. బంగ్లా కోసం తానూ కూడా సత్యాగ్రహం చేశానని అప్పటి విషయాల్ని మోదీ గుర్తుచేసుకున్నారు.

కాగా, బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఢాకాలో పండిట్ అజోయ్ చక్రవర్తి స్వరపరిచిన రాగాలాపన ప్రముఖులను, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

అంతకుముందు భారత ప్రధాని మోదీ బంగ్లా అమరవీరుల స్మారక స్థలాన్ని సందర్శించి, జాతీయ పరాక్రమ వీరులకు ఘన నివాళులర్పించారు. వారి పోరాటాలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. వారు తమ జీవితాల్ని ధర్మాన్ని పరిరక్షించడానికి, అన్యాయాన్ని ప్రతిఘటించడానికి అంకితం చేశారని మోదీ అన్నారు.

Read also : AP Election Commissioner : నిమ్మగడ్డ స్థానంలో కొత్త నియామకం, ఏపీ కొత్త ఈసీగా నీలం సాహ్ని