Indian Mountaineers: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకులపై నిషేధం
Indian Mountaineers: భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకుల విషయంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు చెందిన నరేందర్ సింగ్ యాదవ్..
Indian Mountaineers: భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకుల విషయంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు చెందిన నరేందర్ సింగ్ యాదవ్, సీమా రాణిపై ఆరు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. నరేందర్ సింగ్ యాదవ్, సీమా రాణి 2016లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆధారాలుగా చూపడంతో నేపాల్ ప్రభుత్వం వారికి ధృవీకరణ పత్రాలను అందించింది.
అనంతరం వారి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన నేపాల్ సర్కార్.. విచారణ జరిపింది. నరేందర్‌సింగ్ యాదవ్, సీమా రాణి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించలేదని ప్రభుత్వం జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో వారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నరేందర్‌సింగ్ యాదవ్, సీమా రాణిపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది నేపల్ ప్రభుత్వం.
Also Read: GHMC Mayor Frock Special: జీహెచ్ఎంసీ మేయర్ గౌను కుట్టేది ఎవరో తెలుసా ? అతని ప్రత్యేకత ఎంటీ ?