టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. ఒకటిన్నర మైళ్ల మేర దెబ్బతిన్న వాహన శ్రేణి
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Texas Accident : అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోరరోడ్డుప్రమాదంలో ఆరుగురు మంది మృతి చెందారు.. ఒకటీ రెండూ కాదు..ఏకంగా 70 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. దీంతో ఒకదానితో మరొక వానం ఢీకొంటూ కిలో మీటర్ల మేర ప్రమాదానాకి గురయ్యాయి. దీంతో రహదారిపై భారీగా వాహనాలు పేరుకుపోయాయి. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. ఇదిలావుంటే, టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read Also… ఆలయం చేరిన మెస్రం ఆరాధ్య దైవం నాగోబా.. మహాపూజతో అట్టహాసంగా మొదలైన నాగోబా జాతర